• తాజా వార్తలు

అది ఫాస్టెస్టే కాదు స్మార్టెస్టు ట్రైను కూడా...

ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్‌గా ప‌ట్టాలెక్కుతున్న 'గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్' సాంకేతికంగా ఇంతవరకు మన దేశంలో ఏ రైలుకూ లేనన్ని సొబగులను సొంతం చేసుకుంది. ఢిల్లీ - ఆగ్రా మధ్య నడిచే ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 100నిమిషాల్లో 210కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీంతో దీన్ని ఇండియాలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ గా చెబుతున్నారు. అయితే, అదే సమయంలో ఇది స్మార్టెస్ట్ ట్రెయిన్ అని కూడా చెప్పాల్సిందే. ఇందులో 12 ఏసీ కోచ్‌లున్నాయి. ఉచిత వైఫై సౌకర్యం, ఆటోమాటిక్‌ డోర్స్‌ తదితర సౌకర్యాలు దీని ప్రత్యేకత.

ఇండియాలో ఏ ట్రైన్ కూడా ఇంతవరకు పూర్తిగా వైఫై సౌకర్యంతో లేదు.  దీనికి అదనంగా ఫుల్లీ ఆటోమాటిక్ డోర్స్ ఆకర్షణగా నిలవనున్నాయి. హైపవర్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలార్మ్ వంటివి ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా జీపీఎస్ ఆధారంగా పనిచేసే పాసింజర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కూడా బోగీల్లో ఉంటుంది. బోగీల్లో లైవ్ టీవీ అందుబాటులో ఉంటుంది.

సాంకేతికంగా బాగా అడ్వాన్స్డుగా ఉన్న రైలును మంగళవారం రైల్వే మంత్రి ప్రారంభించనున్నారు. విదేశాలతో పోల్చితే భారతీయ రైల్వేల్లో సాంకేతికత వినియోగం బాగా తక్కువ. గతిమాన్ ఎక్సుప్రెస్ తో కొంతవరకు ఆ కొరత తీరబోతోంది. గతం కంటే కొంత మెరుగ్గా ఇందులో సాంకేతిక వినియోగం అధికంగా ఉంది. భారత రైల్వేల్లో భవిష్యత్తులో సాంకేతికతకు మరింత స్థానం దక్కేలా ఇది నాంది అవుతుందని భావిస్తున్నారు.

 

జన రంజకమైన వార్తలు