• తాజా వార్తలు

80 భాష‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేసే ట్రావిస్


* పాకెట్లో ప‌ట్టేంత చిన్న డివైస్‌
* ఆఫ్‌లైన్లోనూ ప‌ని చేస్తుంది
కొత్త ప్ర‌దేశానికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ లాంగ్వేజ్ మ‌న‌కు రాక‌పోతే చాలా క‌ష్టం. ఈ ఇబ్బంది తీర్చ‌డానికి టెక్నాల‌జీ మ‌న‌కు సాయం చేస్తుంది. ప్రపంచంలోని 80 భాష‌ల‌ను ట్రాన్స్‌లేట్ చేసి చెప్పేందుకు ట్రావిస్ పేరిట ఓ చిన్న‌ డివైస్ ను అందుబాటులోకి తెచ్చేసింది.
ఇంగ్లీష్‌, హిందీ లాంటి లాంగ్వేజ్ ల‌కు రీచ్ ఎక్కువ ఉంటుంది. కానీ అవి తెలియ‌ని, తెలిసినా వాడ‌ని ప్రాంతాలుంటాయి. త‌మిళనాడులో ఇంగ్లీష్‌, హిందీ వ‌చ్చినా, మ‌నం మాట్లాడే తెలుగు తెలిసినా కూడా వాళ్లు త‌మిళంలోనే మాట్లాడ‌తారు. ప‌క్క రాష్ట్రంలోనే ఇలా ఉంటే ఏదైనా విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు లోక‌ల్ లాంగ్వేజ్ తెలుసుకోలేక‌పోతే ఎలా? కానీ అప్ప‌టిక‌ప్పుడు కొత్త భాష‌ను నేర్చుకోలేం. ఇలాంటి వాటికి గూగుల్‌లో కొన్నిస‌ర్వీసులున్నాయి. ఇప్పుడు ట్రావిస్ పేరిట ఓ డివైసే అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌తి లాంగ్వేజ్‌కు సంబంధించి బెస్ట్ యాప్ ఉండ‌డం వ‌ల్ల ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసి చెబుతుంది.
ట్రావిస్ ఎలా ఉంటుంది?
రిమోట్ కంట్రోల్‌లా ఉంటుంది. పాకెట్లో ప‌ట్టేంత చిన్న‌సైజులో ఉండే ఈ డివైస్ ను ఆన్‌చేస్తే అవ‌తలి వ్య‌క్తి మాట్లాడుతున్న లాంగ్వేజిని ఆటోమేటిగ్గా ఐడెంటిఫై చేసి మ‌న భాష‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి వాయిస్ రూపంలో చెబుతుంది. ఆన్‌లైన్‌లో 80 భాష‌ల వ‌ర‌కు ట్రాన్స్‌లేట్ చేయ‌గ‌లదు. నెట్‌వ‌ర్క్ సౌక‌ర్యం లేక‌పోతే ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా 20 మోస్ట్ కామ‌న్ లాంగ్వేజ్‌లను ట్రాన్స్‌లేట్ చేసి చెబుతుంది. నావిగేషన్ కోసం ట‌చ్ స్క్రీన్‌ప్లే డిస్‌ప్లే ఉంది. క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, బ్లూటూత్‌, వైఫై, సిమ్‌కార్డ్ స్లాట్ ఉంటాయి. వారం రోజుల స్టాండ్ బై ఉండే ట్రావిస్‌లోని బ్యాట‌రీ 6 నుంచి 12 గంట‌ల‌పాటు పని చేస్తుంది. ధ‌ర 139 డాల‌ర్లు (దాదాపు 9వేల రూపాయ‌లు).

జన రంజకమైన వార్తలు