• తాజా వార్తలు

ఇంట్లోనే థియేట‌ర్ అనుభూతి పొందాలంటే.. ఈ ప్రొజెక్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి

క‌రోనాతో సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ఇంట్లోనే ప్రొజెక్ట‌ర్ పెట్టుకుంటే థియేట‌ర్ అనుభూతి ఇంట్లోకూర్చుని సేఫ్‌గా పొంద‌వ‌చ్చు. అయితే ధ‌ర కాస్త భ‌రించ‌గ‌లిగి ఉండాలి. అలాంటి ఓ 5 ప్రొజెక్ట‌ర్ల గురించి కాస్త ప‌రిచయం. ఓ లుక్కేయండి.

 

యాంకెర్ స్మార్ట్ పోర్ట‌బుల్ వైఫై వైర్‌లెస్ ప్రొజెక్ట‌ర్ (Anker Smart Portable Pico Wifi Wireless Projector)
ఇది వైర్‌లెస్ ప్రొజెక్ట‌ర్‌. వైఫైతో ప‌నిచేస్తుంది. 100 అంగుళాల బొమ్మ‌ను ప్రొజెక్ట్ చేయ‌గ‌లుగుతుంది. 360 డిగ్రీల కోణంలో పిక్చ‌ర్‌ను చూడొచ్చు. 5వాట్స్ స్పీక‌ర్ ఉంది. సౌండ్‌బార్ లేదా సౌండ్‌బాక్స్‌ల‌కు క‌నెక్ట్ చేసుకుంటే థియేట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ వ‌స్తుంది. చిన్న‌గా 472 గ్రాముల బ‌రువుతో ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.1 ఓఎస్‌తో ప‌ని చేస్తుంది. అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, సోనీ లైవ్ లాంటి ఓటీటీల‌ను డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 4 గంట‌ల ప్లేబాక్ ఇస్తుంది. 
ధ‌ర: 31,999 రూపాయలు.

ఈగేట్ పీ531 ఫుల్ హెచ్‌డీ ప్రొజెక్ట‌ర్ (Egate P531 Full HD Projector)
త‌క్కువ ధ‌ర‌లో ప్రొజెక్ట‌ర్ కావాల‌నుకునేవారికి ఇది మంచి ఆప్ష‌న్‌. ఫుల్ హెచ్‌డీ బొమ్మ‌ను చూడొచ్చు. అమెజాన్ ఫైర్‌స్టిక్ లేదా సెట్‌టాప్ బాక్స్‌ల‌కు కూడా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. రెండు హెచ్‌డీఎంఏ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, ఒక వీజీఏ, ఒక ఏవీ పోర్ట్, ఒక ఆడియో  అవుట్ పోర్ట్ ఉన్నాయి. 5 వాట్స్ బిల్ట్ ఇన్‌స్పీక‌ర్ ఇచ్చారు. దీన్ని ఆడియో అవుట్ పుట్ పోర్ట్ ద్వారా సౌండ్‌బాక్స్‌ల‌కు కూడా క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. క్లాస్‌రూమ్‌ల‌కు, కాన్ఫ‌రెన్స్  హాల్స్‌లో వాడుకోవ‌చ్చు.
ధ‌ర‌: 19,990 రూపాయ‌లు

ఎప్స‌న్ ఈబీ-ఎస్ 41 ఎస్‌వీజీఏ ప్రొజెక్ట‌ర్ (Epson EB-S41 SVGA Projector)
ప్రొజెక్ట‌ర్స్‌లో బాగా ఫేమ‌స్ అయిన ఎప్స‌న్ ప్రొడ‌క్ట్ ఇది. ఎల్సీడీ డిస్‌ప్లే టైప్ ప్రొజెక్ట‌ర్‌. దీనిలో అన్ని ర‌కాల పోర్ట్‌లు ఉన్నాయి. ప్ర‌జంటేష‌న్ ఇవ్వాలంటే దీనికి యూఎస్‌బీ పెట్టి వాడుకోవ‌చ్చు. బిల్ట్ ఇన్ స్పీక‌ర్ కూడా ఉంది. 
ధ‌ర‌: 29,220 రూపాయ‌లు 

బెన్‌క్యూ జీవీ1 ప్రొజెక్ట‌ర్ (BenQ GV1 Projector)
ఇది చాలా చిన్న ప్రొజెక్ట‌ర్‌. బ‌రువు 708 గ్రాములే కాబ‌ట్టి ఎక్క‌డికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. 5వాట్స్ స్పీక‌ర్స్‌, వైఫై క‌నెక్టివిటీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ప‌ని చేస్తుంది. 
ధ‌ర‌: 29,990 రూపాయ‌లు

ప్లే ఫుల్ హెచ్‌డీ ఎల్ఈడీ ప్రొజెక్ట‌ర్ (Play Full HD LED Projector)
ఇది స్మార్ట్ ప్రొజెక్ట‌ర్ కాదు. అయితే ఫుల్  హెచ్‌డీ ప్రొజెక్ట‌ర్‌. లిన‌క్స్ బేస్డ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ప‌ని చేస్తుంది. ధ‌ర త‌క్కువ‌. కాబ‌ట్టి స్టైలిష్ డిజైన్ అవీ ఏమీ లేవు.  ఆఫీస్‌, ప‌ర్స‌న‌ల్ యూసేజ్‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రొజెక్ట‌ర్‌తోపాటు 3డీ గ్లాసెస్ కూడా ఇస్తుంది. 
ధ‌ర‌: 11,990 రూపాయ‌లు.

జన రంజకమైన వార్తలు