మనందరికీ మన పాత ఫోటో ల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకదా! మన చిన్నపుడు కొన్ని సందర్భాలలోనో లేక ఫంక్షన్ ల లోనో తీసుకున్న ఫోటో లు మనకు చాలా ఇష్టంగానూ, ముచ్చట గానూ అనిపిస్తాయి. అ సమయం మళ్ళీ మనకు వెనక్కి రాదు కదా! అంతేగాక ఒక్కోసారి ఆ ఫోటో లలో ఉన్న వ్యక్తులను మళ్ళీ మన జేవితం లో ఇక చూడలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో ఈ ఫోటో లను డిజిటలైజ్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది.అవును పాత ఫోటో లను సురక్షంగా ఉంచుకోవాలి అంటే వాటిని డిజిటలైజ్ చేయడమే ఉత్తమం. మరి డిజిటలైజ్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం స్కానర్ ను ఉపయోగించి ఆ ఫోటో లను స్కాన్ చేసి సరైన సెట్టింగ్ ల ద్వారా వాటిని ఎడిటింగ్ చేసుకుని మెమరీ లో భద్రపరచుకోవడం. లేదా మెమొరీస్ రేన్యుడ్ మరియు డిజిఫై లాంటి ఫోటో స్కానింగ్ సర్వీస్ లను ఉపయోగించడం. అయితే ఇవేమీ అవసరం లేకుండా ఒక్క స్మార్ట్ ఫోన్ యాప్ తోనే ఇవన్నీ చేసే యాప్ ఒకదానిని గూగుల్ విడుదల చేసింది. దీనిపేరు ఫోటో స్కాన్. ఇది ఐఒఎస్ మరియు ఆండ్రాయిడ్ రెండింటిలో లభిస్తుంది. ఇది చాలా తక్కువ సమయం లో అత్యంత వేగవంతంగా మీ ఫోటో లను డిజిటల్ ఫోటోలుగా మార్చడమే గాక వాటిని ఎడిట్ కూడా చేస్తుంది. ఈ ఫోటో స్కాన్ యాప్ గురించిన వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మిగతా అన్ని యాప్ లలాగే దీనిని కూడా ప్లే స్టోర్ నుండి కానీ యాప్ స్టోర్ నుండి కానీ డౌన్ లోడ్ చేసుకుని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఏం చేయాలో మీకే తెలుస్తుంది. స్కానింగ్ కు బదులు ఇందులో ఫోటో ను కెమెరా ద్వారా క్లిక్ చేస్తే చాలు అక్కడనుండి అది ఆ యాప్ లో ఎడిట్ చేయబడి డిజిటల్ ఫోటో గా మారుతుంది. కాకపోతే ముందుగా కెమెరా కు మీరు యా విధమైన పర్మిషన్ ను ఇవ్వవలసి ఉంటుంది.అయితే దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకునే ముందు కొన్ని విషయాలను గమనిద్దాము.
1 మిగతా ఫోటో ల మాదిరిగా ఫోటో స్కాన్ కు లైటింగ్ అనేది ఏమంత విషయం కాబోదు. మీరు మీరు స్కాన్ చేయబోయే ఫోటో ను ఎటువంటి లైటింగ్ పరిస్థితులలో ఉంచి స్కాన్ చేసినా దానికి ఉండే ఫ్లాష్ లైట్ ద్వారా అది తనకు కావలసిన లైటింగ్ ను తీసుకుంటుంది.
2 ఇమేజ్ కు ఎంత దగ్గరగా వీలయితే అంత దగ్గరగా ఉంచి స్కాన్ తీయవలసి ఉంటుంది.
3 ఎంత నిటారుగా వీలయితే అంత నిటారుగా మీరు ఫోటో ను స్కాన్ చేయాలి. ఎందుకంటే కెమెరా ద్వారా స్కాన్ చేసటపుడు ఏ మాత్రం కదిలినా సరే చుక్కలు ఏర్పడి ఇమేజ్ యొక్క క్వాలిటీ ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఫోటో స్కాన్ యాప్ ను ఓపెన్ చేసి కెమెరా ద్వారా మీరు తీయాలి అనుకున్న ఫోటో ను స్కాన్ చేసి శాతర్ బటన్ ను టాప్ చేయాలి. ఇమేజ్ యొక్క మూలలలో నాలుగు చుక్కలు కనిపిస్తాయి. సెంటర్ లో ఉండే సర్కిల్ ను వాటిలో ఎదో ఒక డాట్ వైపుకు జరిపి అది ఫోటో ను స్కాన్ చేసే వరకూ వెయిట్ చేయాలి. ఇదే విధానాన్ని నాలుగు చుక్కలకూ అప్లై చేయాలి.
ఇది ఇమేజ్ ను నాలుగు మూలలా స్కాన్ చేసిన తర్వాత దానిని ప్రాసెస్ చేస్తుంది. ప్రాథమికంగా ఇది అన్ని వైపులా నుండి ఇమేజ్ ను సేకరించి ఫ్లాష్ వలన ఆ ఫోటో కు వచ్చిన గ్లేర్ ను తొలగిస్తుంది. ఇది పూర్తీ ఆటోమేటేడ్ గా ఉంటుంది.
అక్కడనుండి ఇది ఇమేజ్ ను యాప్ గాలరీ లోనికి పంపిస్తుంది. అక్కడ మీరు ఈ ఇమేజ్ ను ఇంకా ఏదైనా ఎడిటింగ్ చేయాలి అనుకుంటే టాప్ చేయడం ద్వారా చేసుకోవచ్చు.
ఒక్కసారి ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు దానిని రొటేట్ చేయవచ్చు, కార్నర్ లను అడ్జస్ట్ చేయవచ్చు, లేదా డిలీట్ చేయవచ్చు. ఇవన్నీ క్రింద వరుసలో ఉండే బటన్ ద్వారా చేయవచ్చు. మీకు ఇమేజ్ సంతృప్తికరంగా అనిపిస్తే బ్యాక్ బటన్ ను ప్రెస్ చేసి వెనక్కి వెళ్లి మరొక ఫోటోను ఇలాగే చేయవచ్చు.
ఇక్కడ మీరు అనేక రకాల స్కాన్ లు కలిగిఉంటే వీటిలో మీకు ఇష్టం లేనిదానిని ఇదే విధంగా డిలీట్ చేయవచ్చు. ఇది క్రింద వరసలో ఉండే ట్రాష్ ఐకాన్ ద్వారా చేయవచ్చు.
ఇక అంతా అయిపోయిన తర్వాత పై వరుసలో ఉండే సేవ్ ఆల్ బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా మీరు చేసిన దానిని సేవ్ చేసుకోవాలి. ఈ యాప్ మిమ్మల్ని స్టోరేజ్ ను అడుగుతుంది. దాని ప్రకారం మీరు ఆయా ఇమేజ్ లను ఫోన్ లో కానీ లేక ఎస్ డి కార్డు లో కానీ స్టోర్ చేసుకోవచ్చు.
వాస్తవానికి ఇలా చేసిన ఇమేజ్ లు ప్రత్యేకమైన స్కానింగ్ పరికరాల ద్వారా చేసిన ఇమేజ్ ల కంటే నాణ్యంగా అనిపించకపోవచ్చు. కానీ కేవలం మొబైల్ యాప్ ద్వారా మీ పాత ఫోటో లని దిగ్తల్ ఫోటోలుగా మార్చడం అంటే మామూలు విషయం కాదు కదా! ప్రత్యేకించి ఇది కూడా దీనికి తగిన నాణ్యంగా ఇమేజ్ లని అందిస్తుంది అందం లో సందేహం లేదు.