• తాజా వార్తలు

ఉటోపియా స్మార్ట్ ఫోన్‌

'యు' టెలీవెంచర్స్‌ సంస్థ మరో కొత్త స్మార్ట్  ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మైక్రోమ్యాక్స్ కు సబ్ బ్రాండ్ అయిన యు ఇప్పటికే తన ఫోన్లకు ఆదరణ పొందగా తాజా హై ఎండ్ గాడ్జెట్ ను తీసుకొచ్చింది.  కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో పోస్టింగులు, టీజర్స్ తరువాత  ఉటోపియా పేరుతో స్మార్ట్ ఫోన్‌ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ. 24,999. ఆన్‌లైన్‌ స్టోర్‌ అమేజాన్‌ ఇండియా ద్వారా ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. నేటి నుంచి ఫోన్లు ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని.. డిసెంబర్‌ 26 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని సంస్థ తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు ప్రకటించారు. కాగా స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్ తో వస్తున్న ఫోన్లలో అందుబాటు ధరలో ఉన్నది ఇదే.  కాగా ఫోన్ తో పాటు కంపెని "Around YU" అనే కొత్త యాప్ రిలీజ్ చేసింది. ఇది మీ ఫోన్ లో ఉన్న ఇతర యాప్స్ నుండి ఇన్ఫర్మేషన్ ను తెచ్చి అన్నీ దీనిలో చూపిస్తుంది.

ఫీచర్లు...
- 5.2 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే
- 2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్ + 1.5GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్.  ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 810 SoC.
- 4 జీబీ రామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
- 21 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
- ఆటో ఫోకస్ సదుపాయం, ఫోకస్ టైమ్ హాఫ్ సెకెండ్ కన్నా తక్కువ ఉంటుంది
- 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
- ఆండ్రాయిడ్‌ 5.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
- డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం
- 4జీ సపోర్టింగ్‌
- 3000 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0
.

 

జన రంజకమైన వార్తలు