అత్యంత ఖరీదైన ఫోన్లకు పేరుగాంచిన వెర్టూ మరోసారి తన లగ్జరీ ఫోన్ తో ముందుకొచ్చింది. తన తాజా మోడల్ ‘సిగ్నేచర్ కొబ్రా’ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ధర ఎంతో తెలిస్తే షాక్ కావాల్సిందే. దీని ధర అక్షరాలా 2.3 కోట్ల రూపాయలు (3.60 లక్షల డాలర్లు).
కాటేసే కోబ్రా
సిగ్నేచర్ కోబ్రా అన్న పేరుకు తగ్గట్టే ఈ ఫోన్ చుట్టూ ఓ పాము బొమ్మ ఉండడం స్పెషాలిటీ. 439 కెంపులను పొదిగిన ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఫోన్ చుట్టూ ఉన్న పాము బొమ్మ కళ్లుగా పచ్చలను(ఎమరాల్డ్స్) పొదిగారు.
8 ఫోన్లే తయారీ
బ్రిటన్ లో తయారుచేసిన ఈ ఫోన్ ను చాలా పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేశారు. కేవలం ఎనిమిది అంటే ఎనిమిదే పీస్ లు తయారు చేశారు. ఈ ఫోన్ కొనాలని ఆసక్తి కలిగిన వాళ్లు చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ జేడీ.కామ్‌లో బుక్ చేసుకోవచ్చు. 145 డాలర్లు అదనంగా చెల్లించి ప్రీ-బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్లు
ఫీచర్ల విషయానికొస్తే ఇది అత్యంత సాధారణమైనదే అయినా విలువైన రత్నాలు పొదగడంతో భారీ ధర ఉంది. రెండు అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంది. బ్యాటరీ బ్యాకప్ అయిదు గంటలు ఉంటుంది.