ఇండియా లో రెండవ అతి పెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన వోడాఫోన్ జియో నుండి వస్తున్నపోటీని తట్టుకుని నిలబడడానికి సర్వశక్తులూ ఒడ్డుతుంది. ఈ నేపథ్యం లోనే ఆకర్షణీయమైన డేటా ప్లాన్ లను మరియు టారిఫ్ లను అందుబాటులోనికి తీసుకువచ్చింది. వీటిలో ఈ మధ్య వోడాఫోన్ ప్రవేశ పెట్టిన సూపర్ అవర్ డేటా ప్యాక్ యూజర్ లనుండి మంచి స్పందన అందుకుంటుంది. ఈ ప్యాక్ తో కేవలం రూ 16/- లకే ఒక గంట పాటు వోడాఫోన్ అపరిమిత 3 జి లేదా 4 జి డేటా ను అందిస్తుంది.
ఇది నిజంగా అద్భుతమైన ప్లాన్ లాగా ఉన్నదా? జియో కూడా దాదాపు ఇదే ఆఫర్ ను ( ఇంతకంటే బెటర్ ) ను అదికూడా ఉచితంగానే అందిస్తుంది కదా! మరి ఇందులో గొప్ప ఏముంది? అసలు ఇది నిజంగా అతి చవకైన ప్లానేనా? తదితర విషయాలను గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.
వోడాఫోన్ ప్రవేశ పెట్టిన ఈ డేటా ప్లాన్ తో యూజర్ లు ఒక గంట పాటు అపరిమిత బ్రౌజింగ్, డౌన్ లోడింగ్ చేయవచ్చు. ఒక్కక్షణం జియో ఆఫర్ గురించి మరచిపోతే ఇది నిజంగానే గొప్ప ప్లాన్ లాగా కనిపిస్తుంది. అంతేగాక కేవలం రూ 5/- ల రీఛార్జి 2 జి కస్టమర్ లు కూడా గంట పాటు అపరిమిత 2 జి డేటా ను పొందవచ్చు. వోడాఫోన్ ఇక్కడితో ఆగలేదు. మరొక అడుగుముందుకు వేసి కేవలం రూ 7/- లకే ఒక గంట పాటు వోడాఫోన్ టు వోడాఫోన్ అపరిమిత వాయిస్ కాల్ లను అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్లాన్ నిజంగానే అద్భుతంగా ఉంది కదా అనిపిస్తుంది. కానీ అసలు ఈ ప్లాన్ నిజంగా అతి చవకైనదా కాదా అనే ప్రసన్ ఉత్పన్నం అయితే మాత్రం ఒక్కోసారి అవును అనీ ఒక్కోసారి కాదు అని సమాధానం వస్తుంది. అదెలాగో చూద్దాం.
ఈ ప్లాన్ ప్రత్యేకించి ప్రయాణం చేసేటపుడు బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మేకు మీ ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ ఇంటర్ నెట్ కనెక్షన్ ఉంది. ఏ విధమైన వర్క్ అయినా అక్కడ చేసుకోగలరు. కానీ ప్రయాణం చేసేటపుడు మీకు ఇంటర్ నెట్ తో అవసరం వచ్చింది. అలాంటి సందర్భాలలో 16 రూపాయలే కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. అది మాత్రమే గాక జియో యొక్క ప్లాన్ ఉచితమే అయినప్పటికే దీని యొక్క నెట్ వర్క్ కవరేజ్ లో హెచ్చు తగ్గులు వస్తూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యం లో ఈ సూపర్ అవర్ ప్లాన్ నిజంగా అద్భుతంగానూ మరియు చవకగానూ ఉంటుంది. ఇక నాణానికి రెండవ వైపు చూసుకుంటే ఒక గంట సేపు అయితే ఏ ఇబ్బందీ లేదు. అదే సమయం ఇంకా ఎక్కువ కావలసి వస్తే మాత్రం ఈ ప్లాన్ తో కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు ఒక గంటా పది నిమిషాల పాటు ఇంటర్ నెట్ వాడారు అనుకోండి. అప్పుడు మీకు దాని ఖర్చు రూ 32/- లు అవుతుంది. దానికంటే మామూలు డేటా ప్యాక్ నే బెటర్ కదా? కాబట్టి ఇది నిజంగా అతి చవకైనదా కాదా అనేది మీ యొక్క వాడకం పై ఆధారపడి ఉంటుంది.
"