మనకు ఏ సమాచారం కావాలన్నావెబ్ లో చూడడం సాధారణం అయిపొయింది. కానీ ఇంటర్ నెట్ ఆన్ చేసి వెబ్ లో చూస్తే చాలు చికాకు పుట్టించే యాడ్ లు, పాప్ ఓవర్ యాడ్ లు, మనం ఏదైనా చూస్తుంటే వెనకనుండి ఆడియో వస్తుంది, కొన్ని సార్లు వీడియో లు కూడా ప్లే అవుతూ ఉంటాయి, వీటన్నింటినీ చూస్తుంటే అసలు వెబ్ అంటేనే విసుగు వచ్చేస్తుంది. కానీ ఈ సారి నుండీ అలా ఏవీ మిమ్మల్ని చికాకు పెట్టకుండా టాప్ 10 ఎక్స్ టెన్షన్ బ్రౌజర్ లను మీ కోసం ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం. 10. బిహైండ్ ది ఓవర్ లే ( క్రోమ్/ఫైర్ ఫాక్స్ ) మీరు ఏదో ఒక వెబ్ సైట్ లో ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటారు. సడన్ గా మీకు ఒక పాప్ అప్ యాడ్ కనిపిస్తుంది. న్యూస్ లెటర్ కావాలంటే సైన్ అప్ అవ్వవలసిందిగా ఆ యాడ్ మిమ్మల్ని అడుగుతుంది. ఇలాంటి ప్రకటనలు సాధారణంగా అందరినీ చికాకు పెడుతూ ఉంటాయి. దాన్ని క్లోజ్ చేయడం తప్పితే అక్కడ మనం చేయగల్గింది ఏమీ ఉండదు. అలా కాకుండా ఈ బిహైండ్ ది ఓవర్ లే అనే ఎక్స్ టెన్షన్ ను కనుక మీ వెబ్ బ్రౌజర్ లో ఉంచుకుంటే ఇలాంటి ప్రకటనలన్నింటినీ ప్రక్కకు నెట్టేస్తుంది.ఇది క్రోమ్ మరియు ఫైర్ ఫాక్స్ లలో పనిచేస్తుంది. సైన్ అప్ లేదా సైన్ ఇన్ అవ్వండి అని అడుక్కునే పాప్ అప్ యాడ్ లన్నింటికీ ఇది ఒక చక్కని పరిష్కారం కాగలదు. 9. పేజి వన్ ( క్రోమ్/సఫారీ) మరియు రీ పేజినేషన్ ( ఫైర్ ఫాక్స్ ) ఈ రోజుల్లో పెద్దగా కనపడడం లేదు కానీ ఇంతకుముందు మాత్రం మల్టీ పేజ్ స్లయిడ్ షో లు వెబ్ లో తరచుగా కనిపిస్తూ చికాకు పెడుతూ ఉండేవి. కానీ కొన్ని వెబ్ సైట్ లు ఇప్పటికీ వీటి పై ఆధారపడుతూ తమ పేజ్ లకు ఎక్కువ క్లిక్ లు రావడం కోసం యూజర్ ల సహనానికి పరీక్షపెడుతూ ఉంటాయి. నిదానంగా చదవాలి అనుకునే వారికి ఇవి తలనొప్పి లాగా మారతాయి. కానీ పేజి వన్ ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా క్రోమ్ మరియు సఫారీ యూజర్ లు వీటినుండి బయటపడవచ్చు. ఫైర్ ఫాక్స్ యూజర్ లైతే రీ పేజినేషన్ అనే ఎక్స్ టెన్షన్ ద్వారా వీటినుండి బయటపడవచ్చు. ఈ రెండు ఎక్స్ టెన్షన్ లూ ఇలా చికాకు పెట్టె స్లయిడ్ షో లను పేజి లో ఒక పక్కకు నెట్టివేస్తాయి. 8. లాజరస్ ( క్రోమ్/ ఫైర్ ఫాక్స్ ) వెబ్ ఓపెన్ చేసిన వెంటనే ఏదో ఒక ఫారం ఓపెన్ అయి అక్కడ మీ వివరాలను ఫిల్ చేయవలసిందిగా కొన్ని యాడ్ లు కనిపిస్తూ ఉంటాయి. పాపం కొంతమంది ఫిల్ చేస్తూ ఉంటారు. కొంతమంది వీటిని క్లోజ్ చేసినా కానీ వెంటనే క్లోజ్ అవ్వవు. ఇలాంటి యాడ్ లను సమర్థవంతంగా నిరోధిస్తుంది లాజరస్. ఇది క్రోమ్ మరియు ఫైర్ ఫాక్స్ లలో పనిచేస్తుంది. 7. మ్యాజిక్ యాక్షన్ మనలో చాలామందికి ఉండే అలవాటు. యు ట్యూబ్ లో వీడియో లు చూడడం.యు ట్యూబ్ అత్యంత ఎంటర్ టైన్ మెంట్ ను కలిగించే వెబ్ సైట్ మాత్రమే కాదు అత్యంత చికాకు పుట్టించేది కూడా. మనకు నచ్చిన వీడియో లను చూడనివ్వకుండా చిన్న చిన్న యాడ్ ల రూపం లో ఉన్న వీడియో లు మధ్యలో అంతరాయం కలిగిస్తూ చిరాకు పెడుతూ ఉంటాయి. యు ట్యూబ్ లో వీడియో లు చూసేటపుడు సాధారణంగా ఇది అందరికీ కలిగే అనుభవమే. అయితే మ్యాజిక్ యాక్షన్స్ అనే ఎక్స్ టెన్షన్ ను ఉపయోగించడం ద్వారా ఇలాంటి యాడ్ ల రూపం లో ఉన్న వీడియో లను బ్లాక్ చేసేయవచ్చు. దీనిని ఉపయోగించి వీడియో లు చూడడం ద్వారా ఒక మీడియా ప్లేయర్ లో వీడియో లు చూసిన అనుభూతి కలుగుతుంది. 6. వికీ వాండ్ ( ఫైర్ ఫాక్స్/క్రోమ్/ సఫారీ) సాధారణంగా అందరికీ ఉపయోగపడే వెబ్ సైట్ లలో ముందు వరుసలో ఉండేది వికీపీడియా. కానీ ఇక్కడకూడా యూజర్ లకు చికాకు కలిగించే కొన్ని యాడ్ లు కనిపిస్తూ ఉంటాయి. పేజి తొందరగా లోడ్ అవుతూ ఉంటుంది, నావిగేట్ చేయడానికి కష్టంగా ఉంటుంది, ఇందులో ఎన్నో విభాగాలు ఉండడం వలన అవన్నీ చూడాలి అనుకున్నపుడు ఈ యాడ్ ల వలన విసుగు కలుగుతూ ఉంటుంది. కానీ ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం వికీ వాండ్. అవును ఈ ఎక్స్ టెన్షన్ ను వాడడం వలన వికీ పెడియా ను మీరు ఒక సరికొత్త తరహాలో వీక్షించవచ్చు. చదవడానికి సులభంగా ఉంటుంది, ఇమేజ్ లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 5. సైలెంట్ సైట్ సౌండ్ బ్లాకర్ ( క్రోమ్ ) మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు వెబ్ సైట్ లో ఏదైనా ముఖ్యమైన సమాచారం చూసేటపుడు చిన్న చిన్న ఆడియో క్లిప్ లు లేదా వీడియో క్లిప్ లు మధ్యలో కనిపిస్తూ ఉంటాయి లేదా వినిపిస్తూ ఉంటాయి. సైలెంట్ సౌండ్ బ్లాకర్ అనే ఈ యాడ్ ఆన్ ఎక్స్ టెన్షన్ వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇది ఆటోమాటిక్ గా అలాంటి వీడియో లన్నింటినీ బ్లాక్ చేస్తుంది. ఒక వేళ ఇంకా అలాంటి ఆడియో లు ఏవైనా ఉంటే వాటిని మ్యూట్ చేసేస్తుంది. మీరు కొన్నింటిని బ్లాక్ లిస్టు లో పెట్టుకుంటే మళ్ళీ అవి వచ్చినపుడు ఆటోమాటిక్ గా ఇది వాటిని బ్లాక్ చేస్తుంది. 4. ఇమాగస్ ( క్రోమ్/ ఫైర్ ఫాక్స్) వెబ్ లో సెర్చ్ చేసేటపుడు చిన్న చిన్న థంబ్ నెయిల్స్ లాంటి ఇమేజ్ లు అప్పుడప్పుడూ ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. అవి పెద్ద ఇమేజ్ లను ఓపెన్ చేయనీయకుండా ఉంటాయి. ఇలాంటి వాటిని ఇమాగస్ అనే యాడ్ ఆన్ బ్లాకర్ ద్వారా సమర్థవంతంగా నిరోధించవచ్చు. ఇది క్రోమ్ మరియు ఫైర్ ఫాక్స్ లలో పనిచేస్తుంది. 3. పాకెట్ ( క్రోమ్/ఫైర్ ఫాక్స్/ సఫారీ/ఓపెరా/ ఎడ్జ్) బ్రౌజింగ్ చికాకులనుండి మనలను బయట పడవేసే సాధనాలలో ఇది ప్రముఖమైనది. ఇది దాదాపు అన్ని బ్రౌజర్ లలోనూ పనిచేస్తుంది.వెబ్ బ్రౌజింగ్ లో వచ్చే అన్ని రకాల చికాకులకు ఇది ఒక చక్కని పరిష్కారం అవుతుంది. దీనికి ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. మనం పైన చెప్పుకున్నవి అన్నీ ఈ ఒక్క ఎక్స్ టెన్షన్ తోనే చేయగలిగినంత సామర్థ్యాన్ని ఇది కలిగిఉంటుంది. 2. సోషల్ ఫిక్సర్ ( క్రోమ్/ ఫైర్ ఫాక్స్/ ఓపెరా/ సఫారి) పేస్ బుక్ వాడేటపుడు మనల్ని చికాకు పెట్టె పోస్ట్ ల నుండీ మరియు యాడ్ లనుండీ ఇది మనల్ని కాపాడుతుంది. మనం పేస్ బుక్ వాడేటపుడు మనకు సంబందం లేని గ్రూప్ లు, పోస్ట్ లు వచ్చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసుకోవడం వలన వాటిని నిరోధించవచ్చు. ఇది క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఒపేరా మరియు సఫారీ లలో లభిస్తుంది. 1. యు బ్లాక్ ఒరిజిన్ ( క్రోమ్/ ఫైర్ ఫాక్స్ ) ఇప్పటివరకూ మనకు లభించే యాడ్ ఆన్ ఎక్స్ టెన్షన్ లన్నింటిలోనూ ఇది శక్తివంతమైనది. ఇది వెబ్ యూజర్ కు యాడ్ లు లేని ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఎ యాడ్ లనైనా ఇది ఆటోమాటిక్ గా బ్లాక్ చేసేస్తుంది. ఇది క్రోమ్ మరియు ఫైర్ ఫాక్స్ లలో లభిస్తుంది. |