బ్లూ టూత్.. ఈ పేరు చెబితే స్మార్టుఫోన్లు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాని కాలంలో మ్యూజిక్ లింక్‌లను, ఫొటోలను, డాక్యుమెంట్లను ఒక మొబైల్ నుంచి మరో మొబైల్‌కు పంపడానికి అద్భుతంగా ఉపయోగపడిన టెక్నాలజీ అనే మనకు గుర్తుస్తుంది. ఇప్పుడు మన ఫోన్లో బ్లూ టూత్ ఉన్నా దాంతో మనకు పని లేదు. ఫొటోలను వీడియోలను పంపడానికి, డాక్యుమెంట్లను షేర్ చేయడానికి ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్ లాంటి యాప్‌లు వచ్చేశాక బ్లూటూత్‌తో పని లేకుండా పోయింది. అది మన ఫోన్లలో ఒక అదనపు సౌకర్యంగా మాత్రమే అందుబాటులో ఉంటోంది. అయితే బ్లూటూత్ గురించి మనందరికి తెలుసు.. మరి వెబ్ బ్లూటూత్ అంటే ఏమిటి? ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారు?
మీ డివైజ్‌లను కంట్రోల్ చేస్తుంది
వెబ్ ద్వారా నడిచే బ్లూటూత్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇది దగ్గరలోని బ్లూటూత్ డివైజ్‌లను నియంత్రిస్తుంది. అందుకే దీన్ని వెబ్ బ్లూటూత్ అంటున్నారు. లేటస్ట్ క్రోమ్ బ్రౌజర్‌లో ఇది భాగంగా ఉంది. ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)లో భాగంగా ఈ కొత్త సాంకేతికతను తయారు చేశారు. వెబ్ డిజైనర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి ఒక డౌట్ రావడం సహజం.. అదే సెక్యూరిటీ! వేరే వాళ్లు తమ బ్రౌజర్ల ద్వారా మన బ్లూటూత్ డివైజ్‌ను కంట్రోల్ చేస్తే అది మన డాక్యుమెంట్లకు సెక్యూరిటీ ఎలా అనేది అందరికి వచ్చే సందేహం. అయితే దీనిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఇది నేరుగా మీ డివైజ్‌లను కంట్రోల్ చేయలేదు. మీరు యాక్సిస్ ఇచ్చిన తర్వాతే అది బ్రౌజర్ కంట్రోలోకి వస్తుంది.
వైద్యాన్నే మీ దగ్గరకు తీసుకొస్తున్నాయి
ప్రాక్టీకల్‌గా ఆలోచిస్తే ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే బ్లూటూత్ ద్వారా మనకు సంబంధించిన సమాచారాన్ని మనం కోరుకున్న వారికి వారు ఎక్కడ ఉన్నా వెంటనే పంపేయచ్చు. చాలా స్టేట్స్‌లో ఇప్పటికే డాక్టర్లను ఇలా బ్లూటూత్ ద్వారా పేషెంట్లకు చేరువ చేశాయి. మనల్ని పరీక్షించడానికి, లేదా చేసిన టెస్టుల రిపోర్టులు చూడటానికి కూడా బ్లూటూత్‌ను ఒక సాధానంగా ఉపయోగిస్తున్నారు వైద్యులు. దీని కోసం మనం వారి బ్రౌజర్‌కు యాక్సిస్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం వైద్యం మాత్రమే కాదు మనం ఒక ఆన్‌లైన్ ఇంటర్వూ కోసం కూడా ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వెబ్ బ్లూటూత్ ఇప్పటికే క్రోమ్, ఆండ్రాయిడ్ 6.0 ప్లస్, మెక్, క్రోమ్ ఓఎస్‌లలో లభ్యం అవుతోంది. డెవలప్‌మెంట్ కమ్యూనిటీ, ఏపీఐ ఏడాది నుంచి ఈ విషయంపై కృషి చేస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.