• తాజా వార్తలు

వైఫై కాలింగ్ అంటే ఏమిటి.. అదెలా ప‌ని చేస్తుంది?

వైఫై.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. టెక్నాల‌జీతో ముడిప‌డి ఉన్న ప్ర‌స్తుత స‌మాజాంలో వైఫై అవ‌స‌రం అడుగ‌డుగునా ఉంది. ఒక‌ప్పుడు ఆఫీసుల్లో మాత్ర‌మే వైఫై సేవ‌లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్ర‌తి ఇంట్లోనూ వైఫై ఉంటోంది. మొబైల్ డేటాతో పాటు వైఫై వాడేందుకు చాలా మంది ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీని కారణం నెట్ వేగంగా ఉండ‌డం... మ‌నం ఇంట్లో ఎక్క‌డ ఉన్నా వాడుకునే అవ‌కాశం ఉండ‌డం. అంటే డెస్క్‌టాప్‌లో మాత్రమే కాక‌, లాప్‌టాప్‌, స్మార్టుఫోన్లు, ట్యాబ్‌లలో మ‌నం వైఫై ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే చాలామంది వైఫైని కేవ‌లం నెట్‌ను చూసేందుకు మాత్ర‌మే వాడ‌తారు. కానీ వైఫైతో కాలింగ్ చేసుకోవ‌చ్చ‌నే విష‌యంలో తెలియ‌దు. మ‌రి వైఫై కాలింగ్ ఏమిటి? అదెలా ప‌ని చేస్తుందో తెలుసుకుందామా?

యాప్ కాదు... లాగిన్ అవ‌స‌రం లేదు
వైఫై కాలింగ్ అనేది ఒక అప్లికేష‌న్ కాదు. దీనికి మ‌నం ఎలాంటి లాగిన్ కావాల్సిన అవ‌స‌రం కూడా లేదు. యుఎస్ లాంటి దేశాల్లో ఇది ఎక్కువ‌గా వాడుక‌లో ఉంది. చాలా చోట్ల ఇది ఫ్రీగా ల‌భ్యం అవుతోంది. కొన్ని దేశాల్లో మాత్రం కాల్స్‌కు ఛార్జీలు ప‌డుతున్నాయి.  వైఫై కాలింగ్ అనేది థ‌ర్డ్ పార్టీ ప్రొవైడ‌ర్‌. అంటే ఇది స్కైప్‌, వాట్స‌ప్‌, గూగుల్ హ్యాంగ్ ఔట్స్ లాగే ప‌ని చేస్తుంది.  కారియ‌ర్ బేస్డ్ వైఫై కాలింగ్ ఇటీవ‌ల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. దీని వ‌ల్ల వైఫై హాట్‌స్పాట్‌లు కూడా పెరుగుతున్నాయి. 

కారియ‌ర్ ద్వారా కాల్ చేస్తే ఉప‌యోగం ఏమిటి?
వైఫై కారియర్ ద్వారా కాలింగ్ చేస్తే చాలా ఉప‌యోగాలు ఉన్నాయి. వైఫై కాలింగ్ చేసేటప్పుడు మీ సెల్‌ఫోన్‌లో కాల్ చేసినట్లుగానే మీ ఫోన్ డెయిల్ పాడ్‌, కాంటాక్ట్ లిస్ట్‌ల‌ను మీరు ఉప‌యోగించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల మీ స‌మ‌యం వృథా కాదు... గంద‌ర‌గోళం ఉండ‌దు. సెల్యుల‌ర్, వైఫై కాలింగ్‌కు మ‌ధ్య పెద్ద తేడా క‌నిపించ‌దు. ఎలాంటి డిస్ట‌ర్‌బెన్స్ ఉండ‌దు. 

ఎప్పుడు ఉప‌యోగించాలంటే..
మీ సెల్యుల‌ర్ డెడ్ జోన్ స‌మ‌యంలోనే మీరు వైఫై కాలింగ్ ఉప‌యోగించాలి. వీక్ క‌వ‌రేజ్ ఉన్న సమ‌యంలోనూ మీరు వైఫై కాలింగ్ వాడుకోవ‌చ్చు. పూర్ సెల్యుల‌ర్ క‌వ‌రేజ్ ఉన్న‌ప్పుడు వైఫై కాలింగ్‌తో మీరు లాభం పొందొచ్చు. త్వ‌ర‌లోనే ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం యుఎస్‌లో వైఫై కాలింగ్ చాలా ఎక్కువ‌గా న‌డుస్తోంది.

జన రంజకమైన వార్తలు