• తాజా వార్తలు

చాట్ బోట్స్ రాకతో యాప్స్ కనుమరుగయ్యే అవకాశం ఎంత ?

చాట్ బోట్స్ రాకతో యాప్స్ కనుమరుగయ్యే అవకాశం ఎంత ?

నేటి స్మార్ట్  ప్రపంచం లో పేరుకు తగ్గ్గట్టుగానే అంతా స్మార్ట్ గానే ఉంది. మనం తినే తిండి దగ్గర నుండీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కే క్యాబ్ ల వరకూ అన్ని సేవలూ యాప్ ల రూపం లో లభిస్తున్నాయి. టెక్నాలజీ ఎంతో మార్పు తెచ్చింది కదా! ఏ మార్పూ శాశ్వతం కాదు, ఇది బాగుంది అనుకునే లోపే మరొక కొత్త ఆవిష్కరణ వచ్చి విద్వంసక ఆవిష్కరణ గా నిలిచి పోతుంది. అంటే ప్రత్యామ్నాయాల కు ఎంతో సమయం పట్టడం లేదు. మొన్నటి దాకా మనం మన స్నేహితులతో సంభాషించడానికి అనేక చాటింగ్ యాప్ లు వచ్చేశాయి. మనకు కావలసిన వాటిని  ఆర్డర్ ఇవ్వాలంటే వాటికి సంబందించిన యాప్ లూ వచ్చేశాయి. ఇప్పుడు ఈ రెండింటి కలయికతో చాట్ బోట్ అనే ఒక విద్వంసక ఆవిష్కరణ వచ్చేసింది. ఇది స్మార్ట్ ప్రపంచాన్ని గణనీయంగా మార్చబోతోంది. ఏమిటా చాట్ బోట్?

మనకు కావలసిన ప్రతీ విషయానికీ ఒక యాప్ ను డౌన్ లోడ్ చేసి మీకు విసుగు వచ్చేసిందా? ఒక్క మాట చెబితే చాలు మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలి అని అనిపిస్తుందా? అయితే మీ లాంటి వారి కోసమే ఈ చాట్ బోట్. చాట్ అంటే సంభాషణ లేదా మాట. బోట్ అనే పదాన్ని రోబోట్ నుండి తీసుకున్నారు. అంటే మాట మరియు రోబోట్ ల కలయికే ఈ "చాట్ బోట్". రోబోట్ ఏం చేస్తుంది. దానికి ఇచ్చిన ప్రోగ్రామింగ్ కు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ చాట్ బోట్ కూడా మనం ఏది చెబితే అది చేస్తుంది. వాస్తవానికి ఇది ఒక కృత్రిమ మేధస్సు పరికరం ( ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్) దీనిని చాట్ ప్లాట్ ఫాం పై డిజైన్ చేశారు. అపరిమిత సంఖ్యా లో ఉన్న యాప్ లూ, వెబ్ సైట్ లనూ వెతికే బదులు మనకు కావలసిన దానిని చెబితే చాలు దానికి సంబందించిన సమాచారం అంతా మన కళ్ళముందు ప్రత్యక్షం అవుతుంది.

ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ బాల్య దశ లోనే ఉన్నది. కానీ ఈ దశ లోనే దీని విస్తృతి మాత్రం బాగా పెరిగి పోయింది. భవిష్యత్ మాత్రం ఈ చాట్ బోట్ లదే అనడం లో మాత్రం ఏ సందేహం లేదు. వీటి రాకతో యాప్ లు కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేగాక ఈ చాట్ బోట్స్ వల్ల మనం ఫోన్ ను వాడే విధానం కూడా మారబోతోంది. అందుకే దీనిని విద్వంసక ఆవిష్కరణ అంటున్నాం.

 

జన రంజకమైన వార్తలు