• తాజా వార్తలు

బిట్ కాయిన్స్ గురించి మనమందరమూ తెల్సుకోవాల్సిన విషయాలు

బిట్ కాయిన్ అనేది ఒక విధమైన కరెన్సీ . ఇది దీని యూజర్ లకు ఎటువంటి డబ్బు, క్రెడిట్ కార్డు, మరియు థర్డ్ పార్టీ ల అవసరం లేకుండానే ఏదైనా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రస్తుతం దీనివిలువ ఒక ఔన్సు బంగారం కంటే కూడా ఎక్కువగా ఉంది. ఇది ఒక పూర్తి స్థాయి డిజిటల్ కరెన్సీ. ఈ మధ్య ప్రముఖం గా వార్తల్లో నిలుస్తున సైబర్ నేరగాళ్ళ యొక్క ఫస్ట్ ఛాయస్ గా ఈ బిట్ కాయిన్ లు ఉన్నాయి. రాన్ సం వేర్ ద్వారా సంచలనం సృష్టించిన హ్యాకర్ లు తాము డిమాండ్ చేసిన డబ్బును బిట్ కాయిన్ ల ద్వారా అడిగారు. అలా చేస్తేనే వారి కంప్యూటర్ ల కు తిరిగి యాక్సెస్ లభిస్తుందని చెప్పారు. ఈ బిట్ కాయిన్ లకు పెద్ద చరిత్రే ఉంది. దీని వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.
బిట్ కాయిన్ లు ఎలా పనిచేస్తాయి?
బిట్ కాయిన్ లు అనేవి ఒక డిజిటల్ కరెన్సీ. ఇవి బ్యాంకు లతో కానీ లేదా ఏ విధమైన ప్రభుత్వ కార్యకలాపాల తో కానీ ఒప్పందం చేసుకుని ఉండవు. మిగతా యూజర్ లను వెరిఫై చేయడానికి వారికి కంప్యూటర్ పవర్ ను అందించే వారు వీటిని సృష్టిస్తారు. బదులుగా వీరు బిట్ కాయిన్ లను పొందుతారు. వీటిని కొనవచ్చు మరియు అమ్మవచ్చు లేదా యు ఎస్ డాలర్ లు లేదా ఇతర దేశాల కరెన్సీ లతో ఎక్స్ చేంజ్ కూడా చేసుకోవచ్చు.
దీని విలువ ఎంత ఉంటుంది?
ఈ మధ్య ట్రేడ్ అయిన ఒక బిట్ కాయిన్ విలువ సుమారు 1734.65 డాలర్ లు ఉంటుంది. ఈ బిట్ కాయిన్ లను ఎక్స్ చేంజ్ చేసే కంపెనీ అయిన కాయిన్ బేస్ అనే కంపెనీ చెబుతున్న దాని ప్రకారం దీనివిలువ ఒక ఔన్స్ బంగారం కంటే ఎక్కువే ఉంటుంది. అయితే ఈ విలువ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఒక సంవత్సరం 458 డాలర్ లు గా ఉన్న వీటి విలువ ఈ సంవత్సరం ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగని వీటి విలువ ఎప్పుడూ పెరగదు. వీటి పెరుగుదల లో హెచ్చు తగ్గులు ఉంటాయి. గత జనవరి లో దీని విలువ సుమారు 23 శాతం తగ్గింది.
ఇవి ఎందుకు పాపులర్ అయ్యాయి?
ఈ బిట్ కాయిన్ లు కంప్యూటర్ కోడ్ ల యొక్క లైన్ లు. ఇవి ఒక యూజర్ నుండి మరొక యూజర్ కు మారేటపుడు డిజిటల్ గా సైన్ చేయబడతాయి. ఎవరు వీటిని ఆపరేట్ చేస్తున్నారో తెలియకుండా వీటికి సంబందించిన లావాదేవీ లు నిర్వహించవచ్చు. అంటే మీరు వీటిని ఉపయోగిస్తున్నారనే ఇషయం మరెవరికీ తెలియదు అన్నమాట. అందుకనే టెక్ విశ్లేషకులు, టెక్ లో ఎక్కువ ఆసక్తి కల్గినవారు అలాగే సైబర్ నేరగాళ్ళు వేటిని పాపులర్ చేశారు.
ఇవి ఎలా సెక్యూర్ గా ఉండగలవు?
టెక్ సావి యూజర్ ల నెట్ వర్క్ అయిన మైనర్స్ అనే నెట్ వర్క్ వీటిని సెక్యూర్ గా ఉంచుతుంది. ఇది కంప్యూటింగ్ పవర్ ను బ్లాక్ చైన్ గా మారుస్తుంది. ఈ బ్లాక్ చైన్ గ్లోబల్ గా జరిగే ప్రతీ బిట్ కాయిన్ ట్రాన్సక్షన్ ను పర్యవేక్షిస్తుంది. ఇది ఏ ఒక్క బితో కాయిన్ అయినా రెండవ సారి వాడకుండా ఈ బ్లాకు చైన్ నిరోధిస్తుంది. దీనిని ప్రతిఫలంగా మైనర్ లు మరిన్ని బిట్ కాయిన్ లు పొందుతారు. ఈ మైనర్ లు బ్లాక్ చైన్ ను సురక్షంగా ఉంచినంత కాలం ఇది చలామణీ లోనే ఉంటుంది.
అసలు ఇవి ఎలా వచ్చాయి?
ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ లాగే ఉంది. 2009 వ సంవత్సరం లో సతోషి నకమతో అనే పేరుతో పిలువబడే ఒక గ్రూప్ ఆధ్వర్యం లో ఇది లాంచ్ చేయబడింది. అక్కడనుండి చిన్న చిన్న టెక్ సావి యూజర్ లచే అడాప్ట్ చేయబడింది. ఈ కరెన్సీ దీనియొక్క స్వంత ఇంటర్నల్ లాజిక్ ను కలిగిఉంది. ఆ మద్య ఆస్ట్రేలియా కి సంబందించిన ఒక వ్యక్తీ దీనికి తానె ఫౌండర్ ను అని చెప్పుకొచ్చాడు కానీ దానికి తగ్గ ఆధారాలు చూపించడానికి అతనికి ధైర్యం చాలలేదు.

జన రంజకమైన వార్తలు