మీరు మీ కంప్యూటర్ లో ఏం చేస్తున్నారో దానిని రికార్డు చేయవచ్చు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును మీరు మీ స్క్రీన్ ను రికార్డు చేయవచ్చు. అంతేకాదు అలా రికార్డు చేసిన వీడియో లతో మీరు డబ్బు కూడా సంపాదించవచ్చు. సులభంగా మీ స్క్రీన్ ను ఎలా రికార్డు చేయాలి? దానిని ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలి? అత్యుత్తమ స్క్రీన్ రికార్డర్ ఏది అనే అంశాల పై ఒక సమగ్ర విశ్లేషణ ఈ వ్యాసం. మీరు మీ కంప్యూటర్ లో చేసే ఏ పనినైనా రికార్డు చేసే సౌకర్యాన్ని ఈ స్క్రీన్ రికార్డర్ లు కల్పిస్తాయి. ఈ విధంగా మీరు అద్భుతమైన వీడియోలను రూపొందించవచ్చు. ఈ స్క్రీన్ రికార్డర్ కు ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే Pew Die Pie పేరుతొ యూ ట్యూబ్ లో అందుబాటులో ఉన్న వీడియో లు. యూ ట్యూబ్ లో ఎక్కువ సబ్ స్క్రైబ్ చేయబడిన చానల్ Pew Die Pie. ఇది సెప్టెంబర్ 2015 వరకూ 39 మిలియన్ ల సబ్ స్క్రైబర్ లను కలిగి ఉంది. ఈ వీడియో లను తయారు చేసిన వ్యక్తీ వీటి ద్వారా ఎంత డబ్బు సంపాదించాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతేకాదు అతను తన కంప్యూటర్ లో కేవలం గేమ్ లు మాత్రమే ఆడతాడు. వాటినే రికార్డు చేస్తాడు. ఆ వీడియో లానే యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తాడు. వాటి ద్వారానే డబ్బు సంపాదిస్తాడు. అతను తన కంప్యూటర్ లో గేమ్ లను ఆడేటపుడు స్క్రీన్ రికార్డర్ ను ఉపయోగించి వాటిని రికార్డు చేస్తాడు. అంతేకాదు అలా రికార్డు చేసేటపుడు ఆ వీడియోలకు కొన్ని వింతయైన శబ్దాలు, అరుపులు మరియు సంజ్ఞలు జత చేసి వీడియోలను తయారుచేస్తాడు. తన వీడియో చానల్ లో ఉంచిన ఆ వీడియోల ద్వారా నెలకు మిలియన్ డాలర్ల లో సంపాదిస్తున్నాడు. ఇదంతా కేవలం అతను తన స్క్రీన్ ను రికార్డు చేసే సౌలభ్యం వలననే జరిగింది. ఈ రోజు యూ ట్యూబ్ లో అనేక రకాల వీడియో లు కనిపిస్తున్నాయి. మేక్ అప్ టిప్ ల దగ్గర నుండీ,సాఫ్ట్ వేర్ లు, ఫోటో షాప్ మరియు ఇంకా అనేక ఇతర అంశాలకు సంబందించిన వీడియో లను మనం యూ ట్యూబ్ లో చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా స్క్రీన్ రికార్డర్ ను ఉపయోగించి తయారు చేసినవే! ఈ స్క్రీన్ రికార్డర్ లలో అనేకం అందుబాటులో ఉన్నాయి. ఐస్ క్రీం స్క్రీన్ రికార్డర్, ఎజ్విడ్, కామ్ స్టూడియో, జింగ్ లు వీటికి కొన్ని ఉదాహరణలు. మా పరిశోధన లో తేలిన విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా మంచి స్క్రీన్ రికార్డింగ్ ను అందిస్తాయి. కానీ వీటిలో కాం స్టూడియో కొంచెం ఉత్తమమైనది. అది రికార్డు చేసే విధానం మరియు ఫీచర్ లు మిగతా వాటికీ కొంచెం విభిన్నంగా ఉంటాయి. ఈ క్యాం స్టూడియో యొక్క ముఖ్యమైన ఫీచర్ లు.
మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ స్క్రీన్ రికార్డర్ ను మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకుని అత్యుత్తమ స్క్రీన్ రికార్డింగ్ అనుభూతిని పొందండి. |