స్మార్ట్‌ఫోన్లు వచ్చాక డ్యుయల్ సిమ్‌ల వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక సిమ్ వాడటానికే మొగ్గు చూపే వినియోగదారుల ఇప్పుడు రెండు సిమ్‌లను వాడేందుకు ఎలాంటి ఇబ్బంది పడట్లేదు. అంటే ఇంటర్నెట్ వాడకానికి ఒక సిమ్.. కాల్స్ కోసం ఒక సిమ్ అన్నట్లు ఉపయోగిస్తున్నారు కస్టమర్లు. అయితే స్మార్టు ఫోన్లు ఎన్ని రకాలుగా మారుతున్నా సిమ్‌లు వాటిని ఉంచే నిల్వ ఉంచే స్థానం మాత్రం మారట్లేదు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఇ-సిమ్ (ఎంబడెడ్ సిమ్)లను తయారు చేసి పని చాలా సులభం చేశాయి. అంటే మనం ప్రత్యేకించి తయారు చేసిన స్లాట్‌లలో సిమ్‌లను ఉంచితే చాలు. వాటిని తీయడం, మళ్లీ పెట్టడం చాలా సులభం. అంతేకాదు డ్యుయల్ సిమ్ అనే ఇబ్బంది లేకుండా ఒకే సిమ్‌తో రెండు నెట్‌వర్క్స్‌ను వాడుకోవచ్చు. పైగా మొబైల్ అవసరాలకు తగ్గట్టే నానో, మైక్రో సిమ్ స్లాట్‌లు కూడా వచ్చాయి. కానీ ఈ సాంకేతికత అన్ని మొబైల్స్‌లో కనిపించట్లేదు.
కారియర్స్‌తో ఇబ్బంది లేదు
ఇ-సిమ్‌ల వల్ల కారియర్స్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదు.అందుకే యాపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజాలు ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకున్నాయి కూడా. అయితే వీటిని ఫోన్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేదు. కేవలం యూఎస్ వెర్షన్‌లోని ఐపాడ్, శాంసంగ్ గేర్ ఎస్2 క్లాసిక్ 3జీ, గేర్ ఎస్3 లాంటి మోడల్స్‌లోమాత్రమే ఈ టెక్నాలజీని వాడారు. 2015లో ఇది వాడకంలోకి వచ్చినా.. ఇది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రాచుర్యం పొందలేకపోయింది. ఇ-సిమ్ వల్ల ఉపయోగం ఏమిటంటే మీరు వేరే నెట్‌వర్క్‌కు మారినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సిమ్ కార్డులను ఇన్‌సర్ట్ చేసుకోవచ్చు. ఇలా సౌలభ్యం ఉండేలా ఈ కారియర్‌ను రూపొందించారు.
ఒకే సిమ్ కార్డులో రెండు నెట్‌వర్క్స్
మీ ఫోన్‌లో ఒకే సిమ్ ద్వారా రెండు నెట్‌వర్క్స్‌ను వాడుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అంటే మీరు జస్ట్ స్విచ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. సిమ్ కార్డు మార్చకుండానే మీరు మీ నెట్‌వర్క్స్‌ను మార్చుకోవచ్చు. ఇ-సిమ్‌ను డివైజ్ హార్డ్‌వేర్‌లోఒక భాగంగా తయారు చేశారు. అంటే ప్రొఫైల్ సిస్టమ్‌లోకి వెళ్లి స్విచ్ చేసుకుంటే చాలు. ఒకేసారి రెండు నెట్‌వర్క్స్‌ను ఒకే సిమ్ ద్వారా ఉపయోగించుకోవచ్చన్నమాట. కానీ సెల్‌ఫోన్ ఇండస్ట్రీ మాత్రం ఈ కాన్సెప్ట్‌కు సరిగా కనెక్ట్ కాలేదు.
ఎన్నిమారుతున్నా..
మన ఫోన్లు ఏడాది ఏడాది మారిపోతున్నాయి. కొత్త కొత్త డిస్‌ప్లేలతో వస్తున్నాయి. డ్యుయల్ కెమెరాలు, సెల్పీ స్పెషలిస్టులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇన్ని మారుతున్నా సిమ్ కార్డు విషయంలో మాత్రం ఎంత పెద్ద ఫోన్ అయినా పాత తరహా పద్ధతులనే అవలభిస్తున్నాయి. ఒకే సిమ్ స్లాట్ ఉండే యాపిల్ లాంటి కంపెనీలు కూడా ఇ-సిమ్‌లను సీరియస్‌గా తీసుకోవట్లేదు. భవిప్యత్‌లోనైనా ఇ-సిమ్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వినియోగదారులకు చాలా ఇబ్బందులు తగ్గిన్నట్లే.