• తాజా వార్తలు

ఇంతకీ ఎంఐ6 భారత్ కు వస్తుందా? రాదా?

రెడ్ మీ ఫోన్ ఫ్లాష్ సేల్ అనగానే స్మార్టు ఫోన్లు కొనాలనుకునేవారిలో కొత్త కోరికలు మొదలైపోతున్నాయి. తమకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఫ్లాష్ సేల్ లో తమకు ఆ ఫోన్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నారు. ఒక వేళ దొరికితే ఎవరిని అడిగినా కూడా కళ్లకు అద్దుకుని తీసుకుంటున్నారు. కొందరైతే ఎక్కువ ధర చెల్లించడానికి కూడా రెడీ అవుతున్నారు. రెడ్ మీ ఫోన్లకు ఆ రేంజిలో క్రేజ్ ఉంది మరి. అందుకే ఈ కంపెనీ ఫోన్లు ఫ్లాష్ సేల్ కు వచ్చిన సెకన్లలో అమ్ముడుపోతున్నాయి.

మళ్లీ మే 5న
తాజాగా నిన్న ఎంఐ 6 ఫ్లాగ్ షిప్ కు అనూహ్య స్పందన వచ్చింది. చైనాలో ఈ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ కు వచ్చింది. ఫ్లాష్ సేల్ కు వచ్చిన వెంటనే ఎంఐ 6 స్మార్ట్ ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. సెకన్లలోనే స్టాకంతా అమ్ముడుపోయినట్టు కంపెనీ ప్రకటించింది. ఎంఐ 6 తర్వాతి ఫ్లాష్ సేల్ మే 5న కంపెనీ నిర్వహించనుంది.

మనకు ఛాన్సు లేదా?
అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎంఐ6ను భారత్ లో లాంచ్ చేయడం లేదని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ సైతం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2.45గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64/128జీబీ స్టోరేజ్, డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా, ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు వైపులు కర్వ్డ్ గ్లాస్/ సెరామిక్ బాడీ, 3,350ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. ఈ ఫోన్ ధర సుమారు రూ.23,999గా ఉంది.

జన రంజకమైన వార్తలు