ప్రపంచం స్మార్టుగా మారిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్టు ఫోన్. ప్రతి పనికీ యాప్.. బ్యాంకు పనులకు యాప్, ఫుడ్ ఆర్డర్ చేయాలంటే యాప్, సినిమా టిక్కెట్ బుక్ చేయాలంటే యాప్.. మెసేజ్ లు పంపించుకోవడానికి యాప్.. ఆటలకూ యాప్.. ఇలా ప్రతి పనికీ యాప్ లు వచ్చేశాయి. యాప్ ల వినియోగంలో ఇండియా దూసుకెళ్తోందట. ప్రతిష్ఠాత్మక ‘యాప్ అన్నీ’-2016 రిపోర్టు ప్రకారం ఇండియా యాప్ లను డౌన్లోడ్ చేసుకోవడంలో ముందుందని తేలింది. ఇంతవరకు ఈ విషయంలో టాప్ లో ఉన్న అమెరికాను ఇండియా మించిపోయింది. 2016లో అన్ని దేశాలనూ వెనక్కు నెట్టి ఇండియా టాప్ లో నిలిచింది.
2016లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 9 వేల కోట్ల యాప్ లను డౌన్ లోడ్ చేసుకున్నారు.
2016లో యాప్ ల ఆధారంగా 8,900 కోట్ల డాలర్ల వ్యాపారం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా యాప్ ల వినియోగంలో యూజర్లు 90 వేల గంటల సమయం వెచ్చించారు
ఒక్కో యూజర్ సగటున రోజుకు 2 గంటలు వాడుతున్నారు.
యాప్ ల డౌన్లోడింగ్ లో టాప్ 5 కంట్రీస్(కోట్లలో)
దేశం 2016 2015 2014
భారత్ 610 350 225
అమెరికా 600 590 560
బ్రెజిల్ 520 485 310
రష్యా 300 285 225
ఇండోనేసియా 300 210 130
యాప్ లను వినియోగించడంలో గడుపుతున్న సమయం
దేశం సమయం(కోట్ల గంటల్లో)
భారత్ 14,800
బ్రెజిల్ 13,000
అమెరికా 9,000
ఇండోనేసియా 5,100
మెక్సికో 5,000
సగటును ఒక నెలలో వినియోగదారులు వాడే యాప్ ల సంఖ్య
దేశం యాప్ ల సంఖ్య
చైనా 39
ఇండియా 38
అమెరికా 36
బ్రిటన్ 35
అత్యధిక స్మార్లు ఫోన్ యూజర్లున్న దేశాలు
దేశం స్మార్టు ఫోన్ యూజర్లు
చైనా 57.4 కోట్ల మంది
అమెరికా 18.4 కోట్ల మంది
భారత్ 16.8 కోట్ల మంది