• తాజా వార్తలు

X స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను రూ 12,999/- లకే లాంచ్ చేసిన LG

 X స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను రూ 12,999/- లకే లాంచ్ చేసిన LG

గత సంవత్సరం మొబైల్ వరల్డ్  కాంగ్రెస్ లో ప్రకటించినట్లు గానే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం LG తన కొత్త X స్క్రీన్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ఈ నెల 20 నుండీ స్నాప్డీల్ లో అందుబాటులో ఉన్నది. ఇది రెండు స్క్రీన్ లలో లభిస్తుంది. ఫస్ట్ స్క్రీన్ మరియు సెకండ్ స్క్రీన్ . దీని ధర రూ 12,999/- గా ఉన్నది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిన టైం,డేట్, నోటిఫికేషన్ లు లాంటివి ఈ సెకండ్ స్క్రీన్ లో కనిపిస్తాయి. ఇది కాల్స్ వచ్చినపుడు మెయిన్ స్క్రీన్ పై ఒత్తిడి పడకుండా కాపాడడమే గాక మనం ఉపయోగించిన అప్లికేషను లను ఈజీ యాక్సెస్ లో ఉంచుతుంది. ఈ సెకండరీ డిస్ ప్లే 1.76 అంగుళాలు ఉంటుంది.

ఈ ఫోన్ విశిష్టతలు

  1. పేరు                        - X స్క్రీన్ స్మార్ట్  ఫోన్
  2. ధర                         - రూ. 12,999 /-
  3. RAM                      - 2 GB
  4. ROM                      - 16 GB ఇంటర్ నల్ మెమరీ ఎక్స్ పాండబుల్ టు 2 TB
  5. వెర్షన్                      - ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టం
  6. బాటరీ                    - 2,300 mAh
  7. సిమ్                      -  4 జి LTE
  8. కెమెరా                   - 13 MP మరియు 8 MP ఫ్రంట్ కెమెరా
  9. సైజు                       - 4.93 అంగుళాలు మొదటి స్క్రీన్ , 1.76 అంగుళాల రెండవ స్క్రీన్
  10.  బరువు                - 120 గ్రాములు
  11. బ్లూ టూత్             - 4.1
  12. వైఫై                       -  802.11 b/g/n
  13. లభించు రంగులు బ్లాకు, వైట్, పింక్ మరియు గోల్డ్ కలర్
  14. ప్రాసెసర్                -  స్నాప్ డ్రాగన్ 410క్వాడ్ కోర్ క్లాక్ద్ ఎట్ 1.2 GhzGHz
  15. గ్రాఫిక్స్                 -  అడ్రినో 306 GPUGPU

 

జన రంజకమైన వార్తలు