• తాజా వార్తలు

ఎంఐ నుంచి వైఫై ఎనేబుల్డ్ ఎయిర్ ప్యూరిఫయర్

స్మార్ట్ ఫోన్లను హాట్ కేకుల్లా అమ్మగలుగుతున్న చైనీస్ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన పరిధిని కేవలం ఫోన్లకే పరిమితం చేయడం లేదు. అంతకంతకూ విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో రారాజుగా నిలవాలన్న తాపత్రయంతో పలు ఇతర గాడ్జెట్లనూ ఉత్పత్తి చేస్తోంది. స్మార్టుఫోన్లతో పాటు వేరబుల్స్ లోనూ ఇప్పటికే సత్తా చాటిన షియోమీ ఎయిర్ ప్యూరిఫయ్యర్లనూ తయారు చేస్తోందన్న సంగతి మీకు తెలుసా...? ఎంఐ ఎకోసిస్టమ్స్ డివైస్ గా ‘ ఎంఐ ప్యూరిఫయర్ 2’ పేరిట ఒక ఎయిర్ ప్యూరిఫయర్ ను కూడా షియోమీ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

వైఫైకి కనెక్ట్ చేస్తే చాలు


ఈ స్మార్టు హోం ప్రోడక్ట్ ను వైఫైకి కనెక్ట్ చేసి ‘ఎంఐ హోం యాప్’ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అప్పటి నుంచి యాప్ సహాయంతో ఎయిర్ క్వాలిటీని అనుక్షణం తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇందులోని ఫిల్టర్లను ఎప్పుడు మార్చుకోవాలో కూడా అదే సూచిస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే ఉంది. విండోస్ యాప్ లేదు.

mi.com వెబ్ సైట్లో, ఫ్లిప్ కార్టులో ఇది దొరుకుతుంది. దీని ధర రూ.9,999. దీని ఫిల్టర్ల ధర రూ.2,499.

స్పెసిఫికేషన్లు


* రియల్ టైం ఎయిర్ క్వాలిటీ మోనిటరింగ్
* వైఫై కనెక్టివిటీ
* ఏరో డైనమిక్ ఎయిర్ వోర్టెక్స్
* 400 చదరపు అడుగుల వరకు కవర్ చేయగల సామర్థ్యం

వాటర్ ప్యూరిఫయర్ కూడా..



ఇంకో విషయం ఏంటంటే ఎంఐ నుంచి వాటర్ ప్యూరిఫయర్ కూడా ఉంది. అయితే, ఇది ఇంకా ఇండియన్ మార్కెట్ కు రావాల్సి ఉంది. దీన్ని ఎప్పుడు ఇండియన్ మార్కెట్ కు లాంచ్ చేసేది ఎంఐ ఇంకా ప్రకటించలేదు. అయితే, చైనాలో మాత్రం ఇది అందుబాటులో ఉంది.

జన రంజకమైన వార్తలు