మొబైల్ తయారీలో బాగా పేరుపొందిన షియోమీ.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నింటిలోనూ తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. లేటెస్ట్‌గా మినీ స్కూటర్‌ను, పవర్‌ఫుల్ ప్రొజెక్టర్‌ను లాంచ్ చేసిన షియోమీ ఎంఐ అల్ట్రాసోనిక్ టూత్‌బ్రష్ ను కూడా రిలీజ్ చేసింది. అల్ట్రాసోనిక్ టెక్నాలజీతో పని చేసే ఈబ్రష్ నిమిషానికి 31వేల సార్లు వైబ్రేట్ అవుతుంది. దీంతో పళ్లు చాలా ఈజీగా, ఫాస్ట్‌గా క్లీనవుతాయి. ధర రూ.1890. జూలై 18 నుంచి ఈ టూత్‌బ్రష్ చైనాలో లభిస్తుంది.
బ్రసిల్స్‌ను మార్చుకోవచ్చు
బ్రష్‌లో ఉండే కుచ్చులు (బ్రసిల్స్)ను కూడా రకరకాలుగా మార్చుకోవచ్చు. బ్లూటూత్, యాప్ తో స్మార్ట్‌ఫోన్‌కు ఈ బ్రష్‌ను కనెక్ట్ చేసుకోవాలి. అప్పడు బ్రజిల్స్ ఆకారం, సైజ్‌ను కావాల్సినట్లు మార్చుకునే ఫెసిలిటీ వస్తుంది.
మరిన్ని ఫీచర్లు
* ఐపీఎక్స్7 వాటర్‌ప్రూఫ్ రెసిస్టెన్స్ తో ఈ బ్రష్ పని చేస్తుంది.
* 700 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 18 రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ జీ ఛార్జింగ్ చార్జింగ్ కోసం స్పెషల్ డాక్ కూడా అమర్చారు.