• తాజా వార్తలు

పోర్ట్రానిక్స్ నుంచి డిటాచబుల్ డయల్, వాటర్ ప్రూఫ్ ఫిట్ నెస్ వాచ్ విడుదల

పోర్ట్రోనిక్స్ తన నూతన స్మార్ట్‌వాచ్ 'యోగ్ ఎక్స్‌'ను రీసెంటుగా విడుదల చేసింది. రూ.2,499 కు ఈ స్మార్ట్‌వాచ్ యూజర్లకు లభ్యమవుతోంది. ఇందులో ఓలెడ్ డిస్‌ప్లే, 64 x 32 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, టైమ్, డేట్, బ్యాటరీ డిస్‌ప్లే, డిస్టాన్స్ ట్రాకర్, కెలోరీ కౌంటర్, స్టెప్ కౌంటర్, స్లీప్ ట్రాకర్, ఫోన్ రిమైండర్, అలారం, ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్స్, మిస్డ్ కాల్స్ నోటిఫికేషన్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, 55 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 రోజుల బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫిట్ నెస్ గోల్స్ సెట్ చేసుకోండి
టర్ స్ర్కీన్ డిటాచబుల్ డయల్.. వాటర్ ప్రూఫ్ డిజైన్ ఈ స్మార్ట్ ఫిట్ నెస్ వాచ్ ప్రత్యేకతలు. అంతేకాదు.. దీని సహాయంతో ఫిట్ నెస్ గోల్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఆరు వరకు రిమైండర్లు పెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే... ఇది స్మార్టుఫోన్ నుంచి సోషల్ మీడియా , మిస్డ్ కాల్, ఎస్సెమ్మెస్ వంటి నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు చూపిస్తుంది.
ఒకసారి ఛార్జింగ్ పెడితే అయిదు రోజులు బిందాస్
దీనికున్న 55 ఎంఏహెచ్ బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే అయిదు రోజుల వరకు పనిచేస్తుంది. ఇందులో వాడుకునేందుకు వీలుగా యోగ్ ఎక్స్ యాప్ కూడా ఉంది. దీన్ని గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫిట్ నెస్ ట్రాకింగ్
నడుచుకుంటూనో,. జాగింగ్ చేస్తూనో వెళ్లినప్పుడు ఎంత దూరం కవర్ చేశామో చెబుతుంది. ఎన్ని కాలరీలు ఖర్చయ్యాయో కూడా చెప్తుంది. అంతేకాదు... మనం ఎలా నిద్ర పోతున్నామన్నది ట్రాక్ చేసి స్లీప్ ప్యాటర్నులను విశ్లేషిస్తుంది.

జన రంజకమైన వార్తలు