చైనా ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ బ్రౌజర్ మార్కెట్లో దూసుకెళుతోంది. సాధారణంగా ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయాలంటే ఫైర్‌ఫాక్స్ గూగుల్ క్రోమ్, ఓపెరా మినీ లాంటి బ్రౌజర్లను ఉపయోగిస్తారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్‌ను ఉపయోగించే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ గూగుల్‌కు పోటీ ఇస్తూ యూసీ బ్రౌజర్ కూడా వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటోంది. తమ సంస్థ ఇప్పటికి 400 మిలియన్ల యూజర్ల మార్క్‌ను చేరుకున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఆసియాలో ఇదే అతి పెద్ద మొబైల్ బ్రౌజర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది మొబైల్‌లో ఉపయోగిస్తున్న బ్రౌజర్లలలో దీనికి రెండో స్థానం. ఆసియాలో పీవీ మార్కెట్ ఫస్ట్ క్వార్టర్ షేర్‌లో యూసీ బ్రౌజర్ 30 శాతం కవర్ చేస్తుందట. ఈ విషయంలో యూసీ బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌ను అధిగమించిందని మార్కెట్ వర్గాల సమాచారం. 2004లో మొదలైన ఈ కంపెనీ ఇంటర్నెట్‌లో ఎక్కువమంది బ్రౌజింగ్ చేయడానికి ఉపయోగపడుతుందట. దీని క్లౌడ్ ఎక్సలరేషన్, డేటా కంపారిజన్ ఫీచర్స్ వల్ల భారత్‌లో ఇది దూసుకుపోతుందట. నెట్‌వర్క్స్ పెద్దగా లేని రష్యా, ఇండోనేషియా లాంటి దేశాల్లోల సైతం సులభంగా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడానికి యూసీ బ్రౌజర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అందరికి నాణ్యమైన, సౌకర్యవంతమైన, ఉత్తమమైన సేవలను అందించడానికి తమ సంస్థ అహర్నిశలు కష్టపడుతుందని అలీబాబా కంపెనీ పేర్కొంది. క్లౌడ్ ఆధారిత బ్రౌజింగ్, డౌన్‌లోడ్స్‌లో వేగం, కస్టమైజ్డ్ కంటెంట్ ద్వారానే తమ యూసీ బ్రౌజర్ ఎక్కువమంది ఆకర్షించిందని ఆ కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ ప్రవేశపెట్టిన యూసీ క్రికెట్ అంటే కూడా వినియోగదారులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారట. త్వరలోనే సంగీతం, వీడియోలు తదితర కంటెంట్‌లను కూడా ఎక్కువ సంఖ్యలో అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని యూసీ బ్రౌజర్ వెల్లడించింది. ఇటీవలే ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్టుతో యూసీ బ్రౌజర్ ఒప్పందం చేసుకుంది. హోం పేజీలోనే ఫ్లిప్‌కార్ట్‌కు స్థానం కల్పించింది. దీంతో ఉభయ తారకంగా ఉపయోగం ఉంటుందనేది యూసీ బ్రౌజర్ ప్రణాళిక. ఫ్లిప్‌కార్టు తోడుగా వినియోగదారులకు ఉత్తమమైన షాపింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ కంపెనీ తెలిపింది. |