యాపిల్ తన వార్షిక వరల్డ్ వైడ్ డెవలపర్ల సదస్సులో ఆరు కీలక ప్రకటనలు చేసింది. యాపిల్ హోం ప్యాడ్ పేరుతో సొంతంగా స్మార్టు స్పీకర్లను అందుబాటులోకి తేనుంది. దీంతో పాటు ఐమ్యాక్, మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రొ, మ్యాక్ బుక్ ఎయిర్ లైనప్ డివైజ్ లను అప్ డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు తన కొత్త ఐమ్యాక్ ప్రొను టీజ్ చేసింది. ఇప్పటివరకున్న మ్యాక్ లో అత్యంత శక్తివంతమైన మ్యాక్ గా దీన్ని అభివర్ణించింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
ఐమ్యాక్ ప్రో.. వెరీవెరీ స్పెషల్
ఐమ్యాక్ ప్రోను 8-కోర్ జియోన్ ప్రాసెసర్, 10-కోర్ ప్రాసెసర్, 18-కోర్ ప్రాసెసర్ వేరియంట్లలో తీసుకొస్తున్నారు. మ్యాక్ఓస్ హై సియర్రా, లేటెస్ట్ మ్యాక్ ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీని ధర 4,999 డాలర్లుగా ప్రకటించింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 3 లక్షలు ఉండొచ్చు.
హోం ప్యాడ్
అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ లకు పోటీగా కొత్త స్మార్ట్ హోమ్ స్పీకర్ ను ఆపిల్ ఆవిష్కరించింది. ఆపిల్ హోమ్ పాడ్ స్పీకర్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. దీని ధర 349 డాలర్లు. గూగుల్, అమెజాన్ స్మార్టు స్పీకర్లతో పోల్చితే ధర ఎక్కువే. ఇవి కూడా డిసెంబరు నుంచి అందుబాటులోకి రానున్నాయి.