• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్ మరియు ట్యాబు లకి బెస్ట్ యాంటి వైరస్ ఏది?

ఆండ్రాయిడ్ ఫోన్ మరియు టాబ్లెట్ కలిగి ఉన్నవారికి అత్యంత అవసరమైనది యాంటి వైరస్. లేకపోతే అనేకరకాల వైరస్ లు మరియు మాల్ వేర్ లు మీ డివైస్ లోనికి ఎంటర్ అయ్యి దీని పనితీరు పై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. మిగతా ఆపరేటింగ్ సిస్టం లతో పోలిస్తే వైరస్ బారిన పడే అవకాశం ఆండ్రాయిడ్ లో ఎక్కువ. ఈ నేపథ్యం లో ఆండ్రాయిడ్ డివైస్ లకు కావలసిన అత్యుత్తమ యాంటి వైరస్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.
1. AVG యాంటి వైరస్ సెక్యూరిటీ ఫ్రీ
ఇది pc యాంటి వైరస్ గా కూడా బహుళ ఆదరణ పొందింది. ఇది ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. అధునాతన ఫీచర్ లతో కూడిన సెక్యూరిటీ కావాలంటే మాత్రం దీని ప్రో వెర్షన్ ను కొనుగోలు చేయాలి. అన్ని యాప్ లను స్కాన్ చేయడం, లాక్ చేయడం, వైరస్ మరియు మాల్ వేర్ లనుండి మీ డివైస్ ను కాపాడడం లాంటి విషయాలలో ఇది మీ ఫోన్ కు గరిష్ట రక్షణ ను అందిస్తుంది.
2. అవాస్ట్ మొబైల్ సెక్యూరిటీ అండ్ యాంటి వైరస్
AVG తో పాటు ఇది కూడా ఒక ప్రముఖ యాంటి వైరస్ . ఇది కూడా తన pc వెర్షన్ ను ముందుగానే కలిగి ఉంది. ఇది ప్రొటెక్షన్ కు సంబందించిన బేసిక్ ఫీచర్ లతో కూడిన అద్భుతమైన ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంటుంది. మరింత టైట్ సెక్యూరిటీ కావలంటే మాత్రం దీని ప్రీమియం వెర్షన్ కొనుగోలు చేయాల్సిందే.ఎందుకంటే ఫ్రీ వెర్షన్ కేవలం బేసిక్ ఫీచర్ లను మాత్రమే ఆఫర్ చేస్తుంది.
3. లుక్ అవుట్ సెక్యూరిటీ మరియు యాంటి వైరస్
లుక్ అప్ అనేది ఒక అత్యుత్తమ ఫ్రీ యాంటి వైరస్ యాప్. ఇందులో బ్యాక్ అప్, లాస్ట్ మరియు స్టోలెన్ డివైస్ ఫీచర్స్ లాంటి అనేక రకాల ఫీచర్ లు ఉంటాయి. ఇది మీ డివైస్ కు ఇన్ స్టంట్ గా రక్షణ ను అందిస్తుంది. యాప్ స్కానింగ్ తో పాటు ఇది మీరు మీ డివైస్ లో డౌన్ లోడ్ చేసే ప్రతీదానినీ స్కానింగ్ చేస్తుంది. ఇది కొన్ని ఫోన్ లలో బ్లోట్ వేర్ లాగా ఇన్ క్లూడ్ అయ్యి ఉంటుంది.
4. ESET మొబైల్ సెక్యూరిటీ మరియు యాంటి వైరస్
ఇది కూడా మీ ఆండ్రాయిడ్ డివైస్ లకు అద్భుతమైన ప్రొటెక్షన్ ను అందిస్తుండ్. దీని ధర సంవత్సరానికి సుమారు 16 డాలర్ లు ఉంటుంది. దీనితో పాటు మీకు సిమ్ గార్డ్ కూడా లభిస్తుంది. ఇందులో ఉండే విశిష్ట మైన ఫీచర్ లు మీ ఫోన్ లో వేరే సిమ్ వేసినా సరే మీ ఫోన్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక ఆహ్లాదకరమైన ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంటుంది.
5. MacAfee యాంటి వైరస్ మరియు సెక్యూరిటీ
ఇది ఒక ఫ్రీ యాంటి వైరస్ యాప్. థెఫ్ట్ ప్రొటెక్షన్, ఆన్ లైన్ బ్రౌజింగ్ ప్రొటెక్షన్, యాప్ ల స్కానింగ్, బ్యాక్ అప్ ఫీచర్, లాంటి స్టాండర్డ్ ఫీచర్ లను కలిగి ఉంటుంది. ఇందులో అప్ గ్రేడేడ్ ప్రో వెర్షన్ కూడా ఉంది,. ఇది మరింత సెక్యూరిటీ ని అందిస్తుంది.

జన రంజకమైన వార్తలు