ఫిట్ నెస్ ట్రాకర్లు, ఫిట్ నెస్ బ్యాండ్లు ఎన్ని అందుబాటులోకి వచ్చినా కూడా అందులో కొన్ని పరిమితులే ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని కీలక అంశాల విషయంలో కచ్చితత్వం ఉండడం లేదు. కానీ... ఇప్పుడు యాపిల్ సంస్థ నుంచి ఒక కీలక ప్రొడక్ట్ రావడంతో ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఆసక్తి చూపుతున్నారు. బ్లడ్ షుగర్ తెలుసుకునే వీలుండడమే దీని ప్రత్యేకత. అది కూడా ప్రత్యేకంగా ఫిట్ నెస్ బ్యాండ్ గా కాకుండా యాపిల్ వాచ్ లోనే ఈ ఆప్షన్ తీసుకొస్తున్నారు.
ఇప్పటివరకు ఎక్కువగా ఇలాంటి వాచెస్, ట్రాకర్లలో హార్ట్‌రేట్ సెన్సార్, స్టెప్ ట్రాకర్ వంటి ఫీచర్లు మాత్రమే ఉండేవి. అయితే ఇకపై యాపిల్ తయారు చేయనున్న వాచ్‌లలో ఇవే కాదు, బ్లడ్ షుగర్ ట్రాకర్లు కూడా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.
దీని వల్ల నిరంతరంగా యూజర్లు తమ బ్లడ్ షుగర్ స్థాయిలను పరిశీలించవచ్చు. అసాధారణంగా అనిపిస్తే వెంటనే తగిన చికిత్స తీసుకోవచ్చు. యాపిల్ తాను కొత్త తయారు చేస్తున్న వాచ్‌లలో ఈ తరహా ట్రాకర్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు గాను ఓ మెడికల్ డివైస్ మేకింగ్ సంస్థతో ఇప్పటికే యాపిల్ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. దీని ద్వారా యాపిల్ తన కొత్త వాచ్‌లలో బ్లడ్ షుగర్ ట్రాకర్లను అమర్చి యూజర్లకు అందివ్వనున్నారు.