మనిషికి, స్మార్టు ఫోన్లకు విడదీయలేని బంధమేర్పడిపోయింది. అంతేకాదు... స్మార్టు ఫోన్లకు యాక్సెసరీస్ మధ్య బంధం కూడా విడదీయలేనంతంగా అల్లుకుపోయింది. పొద్దున్న లేచాక డాటా కేబుల్, హెడ్ సెట్ టచ్ చేయని వారు ఉండరేమో.. ఇవొక్కటేనా ..? ఇంకా ఎన్నో యాక్సెసరీస్ నిత్యం జీవితంలో చాలా ఇంపార్టెంటుగా మారిపోయయి.
* బడ్డీ సెల్ఫీ ఫ్లాష్
ఇప్పుడొస్తున్న ప్రతి స్మార్టు ఫోన్లోనూ సెల్ఫీ కెమేరా ఫ్లాష్ ఉంటోంది.. కానీ, ఇంతకుముందు మోడళ్లలో మాత్రం సెల్ఫీ కెమేరాలకు చాలావాటికి ఫ్లాష్ లేదు. అలాంటి మొబైళ్లలో సెల్ఫీలు కేవలం పగటిపూట మాత్రమే తీసుకోగలం. కానీ... ఆ సమస్యను అధిగమించడానికి ఈ యాక్సెసరీపై ఆధారపడొచ్చు. అదే... సెల్ఫీ ఫ్లాష్.
దీన్ని జేబులో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. ఇందులో 16 ఎల్ ఈడీ బల్బులు ఉంటాయి. చార్జి చేసుకోవచ్చ. 200 ఎంఏహెచ్ బ్యాటరీతో చాలాసేపు చార్జింగు ఉంటుంది.
* ఎంఐ లెడ్ లైట్
కీబోర్డుకు బ్యాక్ లైట్ లేని ల్యాప్ టాప్ లకు ఇది చాలా ఉపయోగం. యూఎస్ బీతో కనెక్ట్ చేస్తే చాలు సరిపడా వెలుతురును ఇస్తుది.
* వరల్డ్ వైడ్ చార్జర్ అడాప్టర్
ప్రయాణాలు.. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా అత్యవసరం. కచ్చితంగా ట్రావెల్ బ్యాగులో ఉండాల్సిన వస్తువు ఇది. సుమారు 150 దేశాల్లో వాడే రకరకాల ప్లగ్ లకు ఇది సూటవుతుంది. అమెజాన్లో దీని ధర రూ.229 ఉంది.
ఇంకా ఇలాంటి యాక్సెసరీస్ మరిన్ని ఉన్నాయి..
* యూఎస్బీ ఫ్యాన్
* కిడ్స్ లాంజ్ ఎల్ ఈడీ షూ లేస్
* 6 వే ఆడియో స్ప్లిట్టర్ జాక్
* ఎంఎక్స్ ప్లాడ్ ఇయర్ ఫఓన్స్
* టెక్నో టెక్ కార్డ్ రీడర్
* 5 ఇన్ 1 మైక్రో కార్డు రీడర్
* వాటర్ ప్రూఫ్ పౌచ్