టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సరిగ్గా ఆ క్రేజ్ ను సొంతం చేసుకోవాలన్న కోరికతోనే స్మార్టు ఫోన్ కంపెనీ జియోనీ తన కొత్త ఫోన్లలో కోహ్లీ సిగ్నేచర్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. మరి అంది ఎంతవరకు వర్కువట్ అవుతుందో చూడాలి.
జియోనీ తన ఎ1 స్మార్ట్‌ఫోన్‌లో 'విరాట్ కోహ్లి సిగ్నేచర్ ఎడిషన్' పేరిట మరో వెర్షన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్రికెటర్ కోహ్లి సంతకం ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఎ1 లో ఉన్న ఫీచర్లే ఇందులోనూ ఉన్నాయి. అవి ఏమీ మారలేదు. ఈ ఫోన్ రూ.19,999 ధరకు వినియోగదారులకు లభిస్తోంది. దీన్ని ఈ నెల 27వ తేదీ నుంచి యూజర్లు కొనుగోలు చేయవచ్చు.
ఇవీ స్పెసిఫికేషన్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.0
4010 ఎంఏహెచ్ బ్యాటరీ