• తాజా వార్తలు

రూ 30,000/- ల ధరలో లభించే బెస్ట్ ల్యాప్ టాప్ లు ఏవి?

సాధారణంగా మంచి ల్యాప్ టాప్ లు అన్నీ ఎక్కువ ధర లో ఉంటాయి. ఒక్కోసారి వీటి ధర చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. అలా కాకుండా మంచి స్పెసిఫికేషన్ లను కలిగి ఉంది ధర కొంచెం అటూ ఇటు గా ఉండాలంటే రూ 30,000/- ల ధర లో లభించే లాప్  ట్యాప్ లను కొనడం ఉత్తమం. ఈ ఆర్టికల్ లో రూ 30 వేల లోపు ధర లో లభించే అత్యుత్తమ ల్యాప్ టాప్ ల గురించి ఇస్తున్నాం.

ఆసుస్ వివో బుక్ మాక్స్

ఇది చాలా డీసెంట్ గా ఉండే ల్యాప్ టాప్. ప్రత్యేకించి స్టూడెంట్స్ మరియు ప్రొఫెషనల్స్ కోసం తాయారు చేయబడింది. ఇందులో ఉండే ఇంటిగ్రేటెడ్ చిప్ సెట్ వలన గేమింగ్ కు ఇది అనువుగా ఉండదు. 15.6 ఇంచ్ స్క్రెంన్, 4 GB DDR4 ర్యామ్, ఇంటర్ కోర్ i3 -7100U CPU, ఇంటెల్ HD గ్రాఫిక్స్  620 లు దీని ప్రత్యేకతలు. దీని ధర ఇండియా లో ప్రస్తుతం రూ 26,990/- ఉన్నది.

లెనోవా ఐడియా ప్యాడ్ 110

ఇది చాలా మంచి ల్యాప్ టాప్. రూ 30,000 ల లోపు లభించే ల్యాప్ టాప్ లలో ఇది ఉండవలసినది. 4 GB ర్యాం 1 TB HDD , 15.6 ఇంచ్ HD డిస్ప్లే, ఇంటెల్ 6 జెనరేషన్ కోర్ ఐ 3 ప్రసేఅర్ లు దీని ప్రత్యేకతలు. దీని ధర అమజాన్ లో ఇండియా లో ప్రస్తుతం రూ 26,990/- లు ఉన్నది.

HP 15 q-BY 002 AX

ఇది కూడా ఒక మంచి లాప్ ట్యాప్.  ఇది AMD A9 ప్రాసెసర్ to పవర్ చేయబడుతుంది. 15.6 ఇంచ్ HD డిస్ప్లే , 1 TB HDD స్టోరేజ్ , 4 GB DDR 4 RAM లు దీని ప్రత్యేకతలు. దీని ధర ఫ్లిప్ కార్ట్ లో రూ 24,990/- ఉంటుంది.

డెల్ ఇన్స్పిరేషన్ 3565

 ఇది ఒక డ్యూయల్ కోర్ ల్యాప్ టాప్.  2.4 GHz తో క్లాక్ చేయబడి ఉంటుంది. 15.6 ఇంచ్ HD డిస్ప్లే, LED బ్యాక్ లిట ట్రూ లైఫ్, 1 TB స్టోరేజ్ , 6 DDR4 RAM , IEEE 802.11 ac బ్లూ టూత్ , లిథియం అయాన్ బ్యాటరీ మొదలైనవి దీని ప్రత్యేకతలు. దీని ధర అమజాన్ లో రూ 21,975/- లు ఉంటుంది.

ఏసర్ అస్పైర్ 3

ఇది ఒక మంచి ల్యాప్ టాప్.  1.1 GHz తో క్లాక్ చేయబడిన డ్యూయల్ కోర్ ల్యాప్ టాప్. 15.6 ఇంచ్ HD డిస్ప్లే LED బ్యాక్ లిట్ TFT, 2 DDR3RAM, బ్లూ టూత్ మరియు వైర్ లెస్ LAN లు దీని ప్రత్యేకతలు. దీని ధర అమజాన్ లో రూ 21,975/- లు ఉంటుంది.

జన రంజకమైన వార్తలు