హై క్వాలిటీ ఎలక్ర్టానిక్స్ కు పేరుగాంచిన సోనీ సంస్థ ఓ నూతన పోర్టబుల్ సౌండ్ సిస్టమ్‌ను రిలీజ్ చేసింది. ఎంహెచ్‌సీ-వి50డి పేరిట విడుదలైన ఈ ఆడియో సిస్టమ్ ఈ నెల 13వ తేదీ నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుంది.
షేక్ చేస్తే పాటలు
ఈ ఆడియో సిస్టమ్‌లో పాటలను ప్లే చేసుకోవాలంటే రిమోట్‌ను ఆపరేట్ చేయాల్సిన పనిలేదు. చేత్తో చేసే మోషన్ కంట్రోల్స్ చాలు. ఈ ఆడియో సిస్టమ్‌ను బ్లూటూత్ లేదా వైఫై ద్వారా యాప్ సహాయంతో ఫోన్‌కు కనెక్ట్ చేయాలి. అనంతరం ఫోన్‌ను ఎడమ చేతిలో పట్టుకుని షేక్ చేస్తే సౌండ్ సిస్టమ్‌లో అంతకుముందున్న ట్రాక్ ప్లే అవుతుంది. కుడి చేతిలో ఫోన్ పట్టుకుని షేక్ చేస్తే తరువాతి ట్రాక్ ప్లే అవుతుంది. దీంతోపాటు ప్లే/పాజ్, వాల్యూమ్ అప్, డౌన్‌లకు కూడా పలు మోషన్ కంట్రోల్స్‌ను ఇందులో ఏర్పాటు చేశారు.
ఇందులో సీడీ లేదా డీవీడీలను వేసుకుని మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. లేదనుకుంటే యూఎస్‌బీ పోర్టు ద్వారా పెన్‌డ్రైవ్‌లను కనెక్ట్ చేసి వాటిలో ఉండే పాటలను సిస్టమ్‌లో వినవచ్చు. దీనికి తోడు హెచ్‌ఎండీఐ పోర్ట్ ద్వారా కూడా పలు డివైస్‌లకు ఈ సిస్టమ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ ఎఫ్‌ఎం ట్యూనర్ ఏర్పాటు చేశారు. దీంతో ఎఫ్‌ఎం రేడియో ట్యూన్ చేసుకుని వినవచ్చు. దీని ధర రూ.33,990.