• తాజా వార్తలు

ఈ టైమెక్స్ వాచ్‌.. "స్మార్ట్ " గురూ..

వాచ్‌ల త‌యారీలో పేరెన్నిక‌గ‌న్న‌టైమెక్స్ కూడా టెక్నాల‌జీ హంగులు అద్దుకుంటోంది. అమెరికాకు చెందిన ఈ వాచ్ కంపెనీ స్మార్ట్‌ ఫీచర్లతో కూడిన ‘ఐక్యూ+మూవ్‌ టుడే’ను మార్కెట్లోకి రిలీజ్‌ చేసింది. ధర 9,995 రూపాయలు. మొత్తం 7 మోడ‌ల్స్‌ను రిలీజ్ చేసింది. ఇందులో జెంట్స్‌కు 4, లేడీస్ వాచ్‌లు మూడు ఉన్నాయ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ వాచీల‌న్నింట్లోనూ సేమ్ పీచ‌ర్లు ఉంటాయి. ఇప్ప‌టికే టైమెక్స్‌ మెట్రోపాలిటన్‌ ప్లస్ పేరుతో ఒక స్మార్ట్ ఫీచ‌ర్స్ వాచ్‌ను టైమెక్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
యాప్ తో క‌నెక్టివిటీ
ఐక్యూ+మూవ్‌ వాచ్‌.. టైమెక్స్ క‌నెక్టెడ్ అనే యాప్ తో క‌నెక్ట్ అవుతుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ల‌లోనూ అందుబాటులో ఉంటుంది. వాచ్‌లో కుడిప‌క్క‌న స‌ర్కిల్‌లో ఉండే చిన్న పార్ట్‌లో మీ డైలీ ఫిజిక‌ల్ యాక్టివిటీని రికార్డ్ చేయొచ్చు.. ఎంత దూరం న‌డిచారు? ఎన్ని క్యాల‌రీస్ ఖ‌ర్చ‌య్యాయి. మీ నిద్ర క్వాలిటీ ఎంత? అనే డిటెయిల్స్ అన్నింటినీ రికార్డ్ చేస్తుంది. ఈ డేటాను బ్లూటూత్ తో స్మార్ట్‌ఫోన్‌కు పంపొచ్చు. చాలా లైట్ వెయిట్‌తో ధ‌రించ‌డానికి చాలా సోఫిస్టికేటెడ్ గా ఉండే ఈ వాచ్ సాంప్ర‌దాయ వాచ్‌లా క‌న‌ప‌డుతూనే స్మార్ట్ ఫీచ‌ర్ల‌తో ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. రాత్రి వేళల్లో కూడా పని చేసేందుకు వీలుగా ఇండిగ్లో బాక్‌లైట్ ఉంది.
ఫ్యూచ‌ర్‌లో మేక్ ఇన్ ఇండియా
ప్ర‌స్తుతం టైమెక్స్ ఫిలిప్పీన్స్‌ నుంచి స్మార్ట్‌ వాచీలు ఇండియాకు ఇంపోర్ట్ చేసుకుని విక్ర‌యిస్తోంది. ఫ్యూచ‌ర్‌లో ఇండియాలో కూడా స్మార్ట్‌వాచీలు తయారుచేసే అవకాశాలున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ సంవ‌త్స‌రం మ‌రిన్ని క‌నెక్టెడ్ వాచ్‌ల‌ను తీసుకొస్తామ‌ని, 2020 నాటికి తమ అమ్మకాల్లో 30 % స్మార్ట్‌ వాచీలుండాల‌న్న‌ది కంపెనీ టార్గెట్ అని టైమెక్స్ చెప్పింది.

జన రంజకమైన వార్తలు