హ్యారీపోటర్ కథల ఫాన్స్‌కు సంతోషకరమైన వార్త. ఈ కథల సృష్టికర్త జేకే రౌలింగ్ హ్యారీపోటర్ ఫాన్స్ కోసం ఆన్‌లైన్ బుక్ క్లబ్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఫ్రీ ఆన్‌లైన్ బుక్ క్లబ్ జూన్ నుంచి అందుబాటులోకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా పేరు
ఫిక్షన్ కథలైన హ్యారీపోటర్ సిరీస్ కథలకు ప్రపంచవ్యాప్తంగాకొన్ని కోట్ల మంది అభిమానులున్నారు. రచయిత జేకే రౌలింగ్ ఏడు బుక్స్‌ను ఒక సిరీస్‌గా ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది పుస్తకాలు అమ్ముడై ఇవి రికార్డులు సృష్టించాయి. ఈ కథలతో హ్యారీపోటర్ సినిమాలు కూడా తీశారు. ఇవి కూడా హాలీవుడ్‌లో ఒక సిరీస్‌గా వచ్చాయి. తెలుగు, హిందీ తోపాటు చాలా భారతీయ భాషల్లో వీటిని డబ్ చేశారు. ఈ సినిమాలకు వరల్డ్‌వైడ్‌గా కలెక్షన్ల కనకవర్షం కురిసింది. ఈ కథల్లో నటించిన యాక్టర్స్ వరల్డ్ ఫేమస్ అయ్యారు.
ఆన్‌లైన బుక్ క్లబ్‌తో మరింత చేరువ
హ్యారీపోటర్ సిరీస్‌లో హ్యారీపోటర్ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్ తొలి పుస్తకం. ఇది మార్కెట్లోకి వచ్చి 20 సంవత్సరాలవుతున్న సందర్భంగా హ్యారీపోటర్ ఫాన్స్ కోసం అన్‌లైన్ బుక్ క్లబ్‌ను జూన్‌లో ప్రారంభించబోతున్నట్లు వీటి రచయిత జేకే రౌలింగ్ ప్రకటించారు. http://pottermo.re/WWBookClub #wwbookclub లింక్ తో వచ్చే ఈ ఆన్‌లైన్ కమ్యూనిటీ హ్యారీపోటర్ అభిమానులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని రౌలింగ్ చెబుతున్నారు. ఇప్పటికే చదివినవారికి ఇది రీ కలెక్షన్ గా పనికొస్తుందని, ఈ కథలను చదివినవారు ఒక ఆన్‌లైన్ వేదిక మీద వాటి గురించి చర్చించుకోవచ్చని చెప్పారు. మొత్తంగా ఇది హ్యారీపోటర్ ఫాన్స్ గ్లోబల్ కమ్యూనిటీగా రూపొందుతుందన్నారు. ఈ కథలను చదవనివారికి ఈ లింక్ ద్వారా చదువుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.