• తాజా వార్తలు

స్మార్టు ఫోన్ యాక్సెసరీస్ తయారు చేస్తున్న బ్యాటరీ కింగ్

ఎనర్జైజర్.. పెన్సిల్ సెల్(బ్యాటరీ)ల తయారీలో టాప్ కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి వస్తోంది. అది కూడా సెల్ ఫోన్ యాక్సెసరీస్ తో వస్తోంది. ముఖ్యంగా హైవోల్టేజి ఛార్జింగ్ సొల్యూషన్స్ అందించనుంది. యాంటీ షాక్ కేసెస్.. హైటెక్ వాల్ చార్జర్లు, కార్ చార్జర్లు, యూఎస్ బీ  కేబుళ్లు మార్కెట్లో ప్రవేశ పెట్టనుంది.
    
* హైటెక్ వాల్ ఛార్జర్
8ఏ చార్జర్ కు సూటయ్యేలా 40 వాట్స్ కెపాసిటీతో 5 పోర్టులున్న హై వోల్టేజ్ వాల్ చార్జర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి.
* స్మార్టు ఫోన్ ప్రొటెక్షన్
స్మార్టు ఫోన్లకు ప్రొటెక్షన్ కల్పించేలా నాణ్యమైన కేసులు విక్రయానికి పెడుతోంది. వీటితో పాటు స్క్రీన్ ప్రొటెక్టర్లు కూడా అందుబాటులోకి తెస్తోంది. ఐపీ68 సెర్టిఫైడ్ యాంటీ షాక్ కేసులు తీసుకొస్తోంది.
* హై క్వాలిటీ ఆండ్రాయిడ్, ఐపోన్ కేబుల్స్
స్మార్టు ఫోన్ యూఎస్బీ కేబుల్స్ ను కూడా వివిధ అవసరాల కోసం అందుబాటులోకి తెస్తోంది. యాపిల్ సర్టిఫైడ్ లైట్నింగ్ కేబుల్స్, , యూఎస్బీ టైప్ సీ కేబుల్స్ వంటివన్నీ అందుబాటులోకి తేనుంది.
వీటితో పాటు ఎస్డీ కార్డులను కూడా రూపొందిస్తోంది.

ఎక్కడ దొరుకుతాయి..
అన్ని ఈ-కామర్స్ సైట్లలో వీటిని విక్రయానికి పెట్టనున్నారు. అంతేకాదు, ఈ ఏడాది చివరి నాటికి పలు నగరాల్లో ప్రత్యేకంగా ఎనర్జైజింగ్ స్టోర్లను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 

జన రంజకమైన వార్తలు