• తాజా వార్తలు

2018 లో కొన్ని తొట్ట తొలి ఫీచర్స్ తెచ్చిన 9 రియల్ స్మార్ట్ ఫోన్ లు

2018 వ సంవత్సరం లో ఇప్పటివరకూ అనేకరకాల సరికొత్త స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అయ్యాయి. వీటిలో దాదాపు అన్నీ ఫ్లాగ్ షిప్ ఫీచర్ లను కలిగిఉన్నవే. ఈ ఫోన్ లలో చాలా వరకూ టాప్ ఎండ్ స్పెసిఫికేషన్ లను కలిగి ఉండడమే గాక కొన్ని సరికొత్త ఫీచర్ లను ప్రవేశ పెట్టిన తొట్ట తొలి ఫోన్ లుగా కూడా ప్రసిద్ది చెందాయి. ఉదాహరణకు వివో నెక్స్ నే తీసుకుంటే ప్రపంచం లో నే మొట్టమొదటి సారిగా పాప్ అప్ కెమెరా తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ గా దీనిని చెప్పుకోవచ్చు. ఇలాగే మరిన్ని మొత్తమ్దొఅతి ఫీచర్ లను తెచ్చిన స్మార్ట్ ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

వివో X 20 ప్లస్ UD

ప్రపంచం లోనే మొట్టమొదటి సారిగా ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగిఉన్న తొలి స్మార్ట్ ఫోన్ గా ఈ వివో X20 ప్లస్ ను చెప్పుకోవచ్చు. వివో మరో రెండు హ్యాండ్ సెట్ లకు కూడా ఈ ఫీచర్ ను తీసుకువచ్చింది. 6.3 ఇంచ్ AMOLED ఫుల్ HD డిస్ప్లే , క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 660 SoC,4 GB RAM, 12+5 MP రేర్ కెమెరా, 12 MP ఫ్రంట్ ఫసింగ్ కెమెరా, 128 GB స్టోరేజ్, 3900 mAh బ్యాటరీ లు దీని మరిన్ని ప్రత్యేకతలు

హువేవి P20 ప్రో

మొట్టమొదటి సారిగా 20 MP మోనో క్రోమ్ సెన్సార్ మరియు 40 MP RGB సెన్సార్, 8 MP టెలి ఫోటో సెన్సార్ లాతో కూడిన లతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా లను కలిగిఉన్న తొలి స్మార్ట్ ఫోన్ గా దీనిని చెప్పుకోవచ్చు. 6.1 ఇంచ్ AMOLED ఫుల్ HD డిస్ప్లే , ఆక్టా కోర్ కిరిన్ 970  ప్రాసెసర్ , 6 GB RAM, , 24 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 128 GB స్టోరేజ్, 4000 mAh బ్యాటరీ లు దీని మరిన్ని ప్రత్యేకతలు

వివో నెక్స్

పరిచయం లో చెప్పుకున్నట్లు పాప్ అప్ కెమెరా తో వచ్చిన మొట్టమొదటి ఆల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ గా దీనిని చెప్పుకోవచ్చు. అంతేగాక ఇందులో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నది. 6.59 ఇంచ్ AMOLED ఫుల్ HD డిస్ప్లే , క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 SoC, 8 GB RAM, 12 MP రేర్ కెమెరా, 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 128 GB స్టోరేజ్, 4000 mAh బ్యాటరీ లు దీని మరిన్ని ప్రత్యేకతలు

సామ్సంగ్ గాలక్సీ S9+

ప్రపంచం లో మొట్టమొదటి సారిగా రేర్ కెమెరా లో వేరియబుల్ అపెర్చర్ మరియు డ్యూయల్ OIS ఫీచర్ ఉన్న తొలి స్మార్ట్ ఫోన్ గా ఈ సామ్సంగ్ గాలక్సీ S9+ ను చెప్పుకోవచ్చు. 6.3 ఇంచ్ AMOLED ఫుల్ HD డిస్ప్లే , ఎక్సినోస్ 9810 ప్రాసెసర్ , 6GB RAM, 12 MP రేర్ కెమెరా, 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64 GB స్టోరేజ్, 3500 mAh బ్యాటరీ లు దీని మరిన్ని ప్రత్యేకతలు

నోకియా 8 సిరోకో

ప్రపంచం లోనే అత్యంత పవర్ ఫన్ స్మార్ట్ ఫోన్ గా ఈ నోకియా సిరోకో 8 స్మార్ట్ ఫోన్ ను చెప్పుకోవచ్చు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో పవర్ చేయబడిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. 5.5 ఇంచ్ AMOLED QHD డిస్ప్లే , 6 GB RAM, 12+13 MP రేర్ కెమెరా, 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 128 GB స్టోరేజ్, 3260 mAh బ్యాటరీ లు దీని మరిన్ని ప్రత్యేకతలు

 ఆసుస్ ROG ఫోన్

ఇది ఆసుస్ నుండి వచ్చిన మొట్టమొదటి గేమింగ్ స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ప్రపంచం లోనే మొట్టమొదటిసారిగా 90 Hz రిఫ్రెష్ రాతేవ్ తో కూడిన AMOLED డిస్ప్లే ను కలిగి ఉన్న ఫోన్ గా కూడా చెప్పుకోవచ్చు. డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్ లను కూడా ఇది కలిగి ఉన్నది. 6 ఇంచ్ AMOLED ఫుల్ HD డిస్ప్లే , క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 SoC, 8 GB RAM, 2+8  MP రేర్ కెమెరా, 12 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 128 GB స్టోరేజ్, 4000 mAh బ్యాటరీ లు దీని మరిన్ని ప్రత్యేకతలు

ఎనర్జైజర్ పవర్ మాక్స్ P16K ప్రో

16,000 mAh పవర్ తో కూడిన నాన్ రిమూవబుల్ బ్యాటరీ ని కలిగిఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 లో ఇది లాంచ్ చేయబడింది. 5.99 ఇంచ్ AMOLED ఫుల్ HD+ IPS LCD  డిస్ప్లే , ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో P25, 6 GB RAM, 16+13 MP రేర్ కెమెరా, 13+5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 128 GB స్టోరేజ్ లు దీని మరిన్ని ప్రత్యేకతలు

HTC ఎక్సోడస్

మొట్టమొదటి బ్లాక్ చెయిన్ ను కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ గా దీనిని చెప్పుకోవచ్చు. బ్లాక్ చెయిన్ సపోర్ట్ ను కాళీ ఉన్న ఇది ప్రముఖ డిజిటల్ కరెన్సీ లు అయిన బిట్ కాయిన్, ఎతెరం మొదలైన వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది.

సికూర్ ఫోన్

ప్రపంచం లోనే మొట్టమొదటిసారిగా ఇన్ బిల్ట్ క్రిప్టో కరెన్సీ వాలెట్ ని కలిగిఉన్న తొలి ఫోన్ గా ఈ సికూర్ ఫోన్ ను చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ నుండి వెలువడిన హ్యాక్ ప్రూఫ్ ఫోన్ అయిన గ్రానైట్ ఫోన్ యొక్క తర్వాతి మోడల్ గా దీనిని పరిగణించవచ్చు.

 

జన రంజకమైన వార్తలు