స్మార్టు ఫోన్లు వాడేవారిలో చాలామంది ఓ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. కొద్ది గంటలకే స్మార్ట్‌ఫోన్‌లోని ఛార్జింగ్ అయిపోవడంతో కాస్త ఇబ్బంది పడుతుంటారు. గంట సేపు ఛార్జింగ్ పెట్టుకున్నా బ్యాటరీ ఫుల్ గా నిండదు. అటువంటి ఇబ్బందులను తొలగించడానికే కేవలం ఐదు నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయ్యే బ్యాటరీలను తీసుకొస్తున్నారు.
ఫ్లాష్ టెక్నాలజీతో..
ఫ్లాష్‌బ్యాటరీ టెక్నాలజీతో రానున్న ఈ బ్యాటరీల ఉత్పత్తి వచ్చే ఏడాది స్టార్టింగులో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయల్‌కు చెందిన స్టోర్‌డాట్ కంపెనీ వీటిని డెవలప్ చేస్తోంది. ఆ సంస్థ సీఈవో డోరొన్ మయెర్స్ డోర్ఫ్ వీటి తయారీకి శర వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే... ఈ తరహా ఛార్జింగ్ మార్కెట్లో కొత్తగా ఏమీ రావట్లేదు. కాకపోతే, టెక్నాలజీ ప్రకారం ఫుల్ చార్జింగ్‌కు సుమారు గంట సమయం పడుతోంది.
అచ్చంగా టర్బోలాగే.
ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ టెక్నాలజీని అందిస్తున్నాయి. అయితే, ఆ గంట సమయం కూడా అవసరం లేకుండా కేవలం ఐదు నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చేయడానికి తాము కృషి చేస్తున్నామని స్టోర్‌డాట్ కంపెనీ సీఈవో చెబుతున్నారు. అంటే ఇది టర్బో ఛార్జింగ్ కు అడ్వాన్స్ డ్ వెర్షన్ అన్నామాట.