• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ కి పండగలా రానున్న కొత్త ఫోన్ లు. ఇప్పటివరకూ తెలిసిన వివరాలు

ఈ సంవత్సరం ఇప్పటికే మూడు నెలలు గడచి పోయింది. ఈ మూడు నెలలలో అనేకరకాల సరికొత్త స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అయ్యాయి. ఫిబ్రవరి లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ప్రకటించిన స్మార్ట్ ఫోన్ లలో దాదాపుగా అన్నీ ఫోన్ లూ ఇప్పటికే లాంచ్ అవడం జరిగింది. రానున్న రోజులలో కూడా సరికొత్త ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ మొబైల్ లు స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకోనున్నాయి. వీటి వివరాలు ఇంకా పూర్తిగా తెలియనప్పటికీ మనకు తెలిసిన సమాచారం మేరకు ఆ సరికొత్త మొబైల్ లు ఏమిటో వాటి విశేషాలు ఏమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

LG G7

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం అయిన LG స్మార్ట్ ఫోన్ రంగం లో కోల్పోయిన ప్రాభవాన్ని తన సరికొత్త ఫ్లాగ్ షిప్ మొబైల్ అయిన LG G7 ద్వారా తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది 6.1 ఇంచ్ LCD స్క్రీన్ మరియు 3120x1440 పిక్సెల్ రిసోల్యూషన్, 845 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 4 లేదా 6 GB RAM, 128 GB స్టోరేజ్ మరియు 16 MP లతో కూడిన రెండు కెమెరా లను కలిగి ఉండనుంది. వీటితో పాటు ఫేషియల్  రికగ్నిషన్ కోసం ఐరిస్ స్కానర్, వాటర్ ప్రూఫ్ ఎక్స్ టీరియర్ లను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది.

వన్ ప్లస్  6

ఈ వేసవిలోనే వన్ ప్లస్ తన లేటెస్ట్ అప్ గ్రేడ్ ను అందించనుంది. ఈ మధ్యనే దీనికి సంబందించిన ఇమేజ్ ను కూడా వన్ ప్లస్ విడుదల చేసింది.కొంచెం మార్చిన డిజైన్, రెండు రేర్ కెమెరాలు, స్టాండర్డ్ హెడ్ ఫోన్ జాక్ లను ఇది కలిగి ఉండనుంది. ఇక మిగతా విషయాలు ఇప్పటికీ గోప్యంగా ఉన్నప్పటికీ మనకు తెలిసిన సమాచారం మేరకు 8 GB RAM మరియు 845 ప్రాసెసర్ లను కలిగిఉండనుంది.

HTC U12 ప్లస్

స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో HTC కి ఇదే చివరి సంవత్సరం గా చెప్పుకోవచ్చు. దీనినుండి రాబోతున్న U12 ప్లస్ ఫ్లాగ్ షిప్ మొబైల్ లో అత్యద్భుతమైన ఫీచర్ లు ఉండే అవకాశం ఉన్నది. WQHD+ డిస్ప్లే తో కూడిన 6 ఇంచ్ LCD డిస్ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 GB RAM, 12 మెగా పిక్సెల్ మరియు 16 మెగా పిక్సెల్ కెమెరా లు, IP68 సర్టిఫికేషన్ ఇలా అనేకరకాల అద్భుత ఫీచర్ లు ఇందులో ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ మే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

షియోమీ బ్లాక్ షార్క్

మరో రెండు వారాలలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా షియోమీ గేమింగ్ ఫోకస్ద్ స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేయనుంది. గత వారం దీనికి సంబందించిన టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 GB RAM, ఫుల్ HD+ స్క్రీన్ లు ఇందులో ఉండనున్నాయి. వీటితో పాటు హీట్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి కూల్ మెకానిజం కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

షియోమీ Mi 7

మినిమం బెజెల్స్ తో కూడిన Mi7 యొక్క ఫ్రంట్ పానెల్ ఇమేజ్ ను ఈ మధ్యే ఇది విడుదల చేసింది. వైర్ లెస్ ఛార్జింగ్,  క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 GB RAM, 128 GB స్టోరేజ్ లు ఇందులో ఉండనున్నాయి.

 

జన రంజకమైన వార్తలు