• తాజా వార్తలు

ఆన్ లైన్ లో ఉచిత సినిమా వీక్షణకు టాప్ 10 వెబ్ సైట్స్ ఏవి?

ఈ రోజు ఆర్టికల్ లో మేరు ఆన్ లైన్ లో మూవీ లను చూడాలంటే ఉన్న పది అత్యుత్తమ సైట్ ల గురించి ఇస్తున్నాము. వీటిద్వారా మీరు ఆన్ లైన్ లో మీకు నచ్చిన మూవీ ని చూడవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో కూడా చూడవచ్చు. మరెందుకు ఆలస్యం అవేంటో తెలుసుకుందాము.
1. IMDB
ఇది ఒక సంపూర్ణ , సంగ్రహాత్మక డేటా బేస్ ను మూవీ లకు సంబంధించి కలిగిఉంటుంది. ఇది షో టైం లనూ, రివ్యూ లను లను మరియు రాబోయే మూవీ లకు సంబందించిన సమాచారాన్ని అందిస్తుంది. టీవీ షో ల యొక్క టైమింగ్ లను కూడా మీరు దీనిలో తెలుసుకోవచ్చు. ఇందులో ABC, TNT, FOX, TBS, TruTV, మరియు Vh1 లాంటి అనేక చానల్ లను వీక్షించవచ్చు.
మూవీ లవర్స్ కు ఇది ఒక మంచి కమ్యూనిటీ లా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు సినిమా చూడడం తో పాటు రేటింగ్ కూడా ఇవ్వవచ్చు. మిగతా విశ్లేషకులతో డిస్కస్ చేయవచ్చు.
2. లెట్ మి వాచ్ దిస్
టాప్ ఆన్ లైన్ మూవీ వాచింగ్ సైట్ లలో ఇది ఒకటి, అంతేగాక ఎక్కువమంది సిఫార్సు చేసేది కూడా ఇదే. ఇక్కడ ఉన్న అతి పెద్ద మూవీ ల యొక్క కలెక్షన్ ను చూస్తే మీరు ఆశ్చర్యచకితులు అవడం ఖాయం. ఏదైనా ఒక మూవీ ని చూడడానికి మీరు మామూలు గా దీనిని ఓపెన్ చేసినా సరే మీకు అనేక రకాల ఆప్షన్ లు కనిపిస్తాయి. మిగతా విశ్లేషకులు ఆయా మూవీ లకు ఇచ్చిన రేటింగ్ లు కూడా కనిపిస్తాయి. తద్వారా ఎక్కువ రేటింగ్ ఉన్న మూవీ లను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని యాడ్ లు ముందుగా వచ్చి మిమ్మల్ని చికాకు పెడతాయి కానీ వాటిని పట్టించుకోకుండా హ్యాపి గా మూవీ ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మీరు ఎన్ని మూవీ లనైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
3. ఆర్కైవ్.ఆర్గ్
పేరుకు తగ్గట్లే అనేక మంచి మంచి మూవీ లు అన్నీ ఇక్కడ ఒక ఆర్కైవ్ ల రూపం లో ఉంటాయి. ఆసక్తికరమైన యూజర్ లు తమ మూవీ లను ఫ్రీ యాక్సెస్ కు మరియు ఓపెన్ డిస్ట్రిబ్యూషన్ కు డొనేట్ చేయవచ్చు. ఇది ప్రధానంగా క్లాసిక్స్ మరియు సినిమా చరిత్ర ప్రారంభం అయిన మొదట్లో వచ్చిన పాత మూవీ లపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అంటే ఇక్కడ మీరు బ్లాక్ అండ్ వైట్ మూవీ లను మాత్రమే గాక మూకీ సినిమా లను కూడా చూడవచ్చు అన్నమాట. వివిధ రకాల ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించే మంచి మంచి క్లాసిక్ మూవీ లను ఇది తన ఆర్కైవ్ లలో ఉంచుతుంది.
4. క్రాకిల్
టాప్ ఆన్ లైన్ మూవీ వెబ్ సైట్ లు అన్నింటి లోనూ ఇది ఫుల్ లెంగ్త్ ఫిలిం లనూ మరియు టీవీ షో లను కలిగి ఉంటుంది. వీటిని ఇది సోనీ లైబ్రరీ నుండి మరియు దానియొక్క ఒరిజినల్ కాంటెంట్ నుండి గ్రహిస్తుంది. అంతేగాక ఇది హులు, AOL మరియు యు ట్యూబ్ లతో కూడా ఒప్పందం కుదుర్చుకుని ఆ మూవీ లను దీనిలో ప్రదర్శిస్తుంది. ఇక్కడ మీరు మూవీ లను వివిధ రకాల మోడ్ లలో చూడవచ్చు.
5. Alluc.org
ఇది లింక్ లను యాడ్ చేయడం ద్వారా మూవీ లను చూపిస్తుంది. దీనిద్వారా ఏదీ కనీసం డౌన్ లోడ్ కూడా చేయబడు. కానీ డౌన్ లోడింగ్ కు కూడా ఇది లింక్ లను యాడ్ చేస్తుంది. కొత్త కొత్త మూవీ లకు సంబందించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది. అంటే లేటెస్ట్ మూవీ లు ఏవైనా మీరు ఇక్కడ చూడవచ్చు అన్నమాట.
6. సోలార్ మూవీ
ఇది ఒక అద్భుతమైన ఫ్రీ మూవీ సైట్.మోస్ట్ పాపులర్ మూవీ ల యొక్క లిస్టు ఒక ఫుల్ పేజి లో ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఎక్కువ భాగం లేటెస్ట్ మూవీ లు కావడం విశేషం. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్న లెట్ మి వాచ్ దిస్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా మూవీ లను వీక్షించడం తో పాటు రేటింగ్ కూడా చేయవచ్చు.
7. వాచ్ మూవీస్
ఇందులో చాలా ఎక్కువ సంఖ్య లో మూవీ లు స్టోర్ చేయబడి ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన మూవీ కోసం మీరు ఇక్కడ వెదకవచ్చు. లేదా ఫిల్టర్ లు మరియు జానర్ ల ద్వారా కూడా చూడవచ్చు. హోం పేజి లో ఇక్కడ ఉండే మూవీ లకు సంబందించిన థంబ్ నెయిల్స్ మరియు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
8. ట్యూబ్ ప్లస్
ఇది రిజిస్టర్డ్ యూజర్ లకి ఉపయోగపడుతుంది. ఇది వీక్షకుల నుండి ఫీడ్ బ్యాక్ ను రాబట్టడం లో బాగా సహాయ పడుతుంది. ఇక్కడ కూడా ఇందులో ఉండే మూవీ ల లిస్టు ఉంటుంది. దానిలో మీకు నచ్చిన దానిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
9. హులు
చాలా మంది మూవీ లవర్స్ ఈ హుఉల్ యొక్క అభిమానులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఉన్న అన్ని హాట్ షో లు మరియు వెబ్ సైట్ లలోని వీడియో లు ఇక్కడ చూడవచ్చు. ఇది హై క్వాలిటీ వీడియో లను అందిస్తుంది. ఇక్కడ ఫిల్టర్ లను ఉపయోగించడం ద్వారా మీకు నచ్చిన మూవీ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.ఈ మధ్య విడుదల అయిన అనేక సినిమా లు ఇక్కడ ఉంటాయి. అయితే ఈ హులు అనేది ప్రస్తుతం US మరియు జపాన్ లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
10. యు ట్యూబ్ మూవీస్
దీని గురించి చెప్పేదేముంది, అందరికీ తెలిసిందే కదా! కామెడీ, క్లాసిక్, యానిమేషన్, ఏక్షన్, అడ్వెంచర్ ఇలా దాదాపు అన్ని జానర్ లకు సంబందించిన వీడియో లు ఇక్కడ ఉంటాయి. అంతేగాక ఈ వీడియో లను మీరు ఫుల్ లెంగ్త్ HD క్వాలిటీ లో వీక్షించవచ్చు.

జన రంజకమైన వార్తలు