మోటోరోలా రెండు హై పర్ఫార్మింగ్ హెడ్ ఫోన్స్ రిలీజ్ చేసింది. శ్యామ్ టెలికాం ఇండియా లిమిటెడ్ తో కలిసి లాంచ్ చేసిన ఈ రెండు మోడల్స్ పూర్తిగా వాటర్ ప్రూఫ్. త్వరలో ఇవి అన్ని ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఇయర్‌బడ్స్ మెటల్, ఇయర్ బడ్స్ స్పోర్ట్స్ పేరిట విడుదల చేసిన ఈ రెండు మోడళ్ల ధర ఒకేలా నిర్ణయించారు. రూ.999 కు దేన్నయినా కొనుగోలు చేయవచ్చు.
సౌండ్ క్వాలిటీ అదుర్స్
ఇందులో ప్రతి ఇయర్ పీస్ లో 10 ఎంఎం నియోడిమియమ్ ఆడియో డ్రైవర్లు ఉండడంతో మంచి క్వాలిటీతో సౌండ్ వస్తుంది. పైగా ఇవి చాలా తేలికైనవి కావడంతో ఎంతసేపు చెవిలో ఉన్నా పెద్దగా ఇబ్బందిగా ఉండదు. ఇవి ఐపీ54 వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉన్నాయి. దీంతో నీటిలో పడినా ఈ హెడ్‌ఫోన్స్‌కు ఏమీ కాదు. మళ్లీ తీసి నిరభ్యంతరంగా ఎప్పటిలాగే ఉపయోగించుకోవచ్చు.
కాల్స్ కోసం బటన్
కాల్స్ కోసం మైక్, ప్రత్యేక బటన్‌ను ఈ హెడ్‌ఫోన్స్‌కు ఏర్పాటు చేశారు. గోల్డ్, రోజ్ గోల్డ్, సిల్వర్, మాట్ బ్లాక్ రంగుల్లో ఇవి లభిస్తున్నాయి. కాగా వీటి సామర్థ్యాన్ని, పనితీరును విస్తృత స్థాయిలో చెక్ చేశాకే వీటిని మార్కెట్లో రిలీజ్ చేశామని మోటోరాలా చెప్తోంది. ముఖ్యంగా అథ్లెట్లు దీన్ని చాలాకాలం వినియోగించి పరీక్షించారని... వారు వాడేటప్పడు ఎంతగా చెమటపట్టినా వీటికేమీ కాలేదని అంటోంది.