కంప్యూటర్ హార్డ్‌వేర్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంటెల్.. అత్యంత శక్తివంతమైన సీపీయూను తయారు చేయబోతుందా? అవునంటున్నాయి టెక్నాలజీ ట్రేడ్ వర్గాలు. ఇప్పటివరకు లేనంతగా కోర్ ఐ9 సీపీయూను తయారుచేయబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు పీసీల్లో వచ్చిన సీపీయూలు అన్నింటికంటే మోస్ట్ పవర్‌ఫుల్, మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఇదే కానుంది.
జైగాంటిక్ పెర్‌ఫార్మెన్స్
ఆనంద్ టెక్ బోర్డ్ లో లీకైన సమాచారం ప్రకారం ..ఈ కోర్ ఐ 9 సీపీయూ ఏకంగా 12 కోర్ తో రానుంది. దీన్నిబట్టి చూస్తే ఈ సీపీయూను భారీ పెర్‌ఫార్మెన్స్ కోసమే డిజైన్ చేశారనిపిస్తోంది. దీని పవర్ వినియోగం 140 వాట్స్. మరో ముఖ్యమైన అంశమేమిటంటే ఇంత పవర్‌ఫుల్ సీపీయూను కేవలం పీసీల్లో మాత్రమే ఇన్‌స్టాల్ చేయగలరు. రాబోయే మేక్ ప్రోకి ఇది మంచి సీపీయూ ఆప్షన్ అవుతుంది.
ధర వెయ్యి డాలర్లపైనే..
భారీ స్పెక్స్‌తో వస్తున్న ఈ సీపీయూ ప్రైస్ వెయ్యి డాలర్లు (65వేల రూపాయల) వరకు ఉండొచ్చని అంచనా. ఈ హైఎండ్ ఐ9 సీపీయై ఆగస్టు నుంచి మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. కోర్ ఐ7లోనూ రెండు ప్రాసెసర్లను ఇంటెల్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి జూన్‌లో రావచ్చు.